సందీప్ కిషన్ కి సపోర్ట్ గా యంగ్ హీరోలు !


‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తర్వాత యువ హీరో సుందీప్ కిషన్ కు ఆ స్థాయి హిట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ దొరకలేదు. చేసిన సినిమాల్లో కొన్ని పర్వాలేదనిపించుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇలాంటి కష్ట కాలంలో ఆయన చేసిన తాజా తమిళ చిత్రం ‘మానగరం’ తమిళంలోనే గాక తెలుగులో కూడా ‘నగరం’ పేరుతో విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తూ హిట్ దిశగా దూసుకుపోతోంది. ప్రేక్షకులు, విమర్శకులు కూడా సందీప్ కిషన్ కెరీర్లో ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.

ఇక సినీ సెలబ్రిటీలు, సందీప్ కిషన్ కి మంచి సన్నిహితులైన యంగ్ హీరోలు నాని, సుశాంత్ లు కూడా సందీప్ కిషన్ కు తమ వంతు సపోర్ట్ అందిస్తున్నారు. సినిమా చూసి నచ్చడంతో తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా చిత్రం బాగుందని, మంచి స్క్రీన్ ప్లే అని, నటీనటులు, ఇతర టీమ్ బాగా కష్టపడ్డారని, తప్పక చూడవలసిన సినిమా అని ప్రేక్షకులకు తెలియజేస్తూ స్నేహితుడి కోసం, ఒక మంచి సినిమా సక్సెస్ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జంటగా రెజీనా నటించింది.