’65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్’ ఈ నెల 16న హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. తెలుగు సెలబ్రెటీలు మాత్రమే కాకుండా, తమిళ్, కన్నడ మరియు మలయాళ సినీ పరిశ్రమల నుండి కూడా సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ కోసం 16న హైదరాబాద్ రానున్నారు. తాజా సమాచారం ప్రకారం యువ హీరోలు రాహుల్ రవీంద్రన్, సందీప్ కిషన్ ‘తెలుగు 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్’ కు తెలుగులో హోస్టింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
సందీప్, రాహుల్ ఇద్దరు చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంటుంది కాబట్టి, హోస్టింగ్ కూడా విజయవంతమవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ కు హీరోగా అవకాశాలు తగ్గేసరికి దర్శకుడిగా టర్న్ తీసుకుని సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం టీజర్ కూడా ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇక గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేని సందీప్ కిషన్ కూడ నెల క్రితమే ఒక కొత్త సినిమాను మొదలుపెట్టాడు.
