పవన్ – త్రివిక్రమ్ ల సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ !
Published on Jun 7, 2017 8:43 am IST


నటిస్తున్న సినిమాలు వియిడుదలవక ముందే యంగ్ హీరోయిన్ మేఘ ఆకాష్ టాలీవుడ్లో సెన్సేషన్ గా మారిపోయింది. మొదట గౌతమ్ మీనన్ – ధనుష్ ల చిత్రంలో అవకాశం దక్కించుకుని అందరి దృష్టిలో పడిన ఈ బ్యూటీ తర్వాత తెలుగులో నితిన్, హను రాఘవపూడిల ‘లై’ సినిమాలో హీరోయిన్ గా కుదిరి ఆ తర్వాత రామ్ – కిశోర్ తిరుమలలు ఈ మధ్యే కొత్తగా ప్రారంభించిన సినిమాలో కూడా అవకాశం చేజిక్కించుకుని ఔర అనిపించుకుంది.

అలా ఈ రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్న ఈమె పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల నిర్మాణంలో నితిన్ హీరోగా త్వరలో మొదలుకానున్న చిత్రంలో సైతం ఛాన్స్ దక్కించుకుని సంచలనంగా నిలిచింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జూన్ 26 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ వార్తపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది.

 
Like us on Facebook