మెగా ఈవెంట్ లో సందడి చేయనున్న హీరోయిన్లు

22nd, August 2016 - 02:21:43 PM

raashi-khanna-rakul
మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో భారీ ఎత్తున ‘ఖైదీ నెం: 150’ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు. కానీ షూటింగ్ కు బ్రేక్ తీసుకుని వెకేషన్ లో ఉండటం వల్ల చిరంజీవి ఏ కార్యక్రమానికి రావట్లేదు. దీంతో అభిమానుల్లో కాస్త నిరుత్సాహం మొదలైంది. దాన్ని పోగొట్టడానికి పవన్ కళ్యాణ్ మినహా మిగతా మెగా హీరోలు చరణ్, బన్నీ, ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వాళ్ళతో పాటే మెగా హీరోయిన్లైన రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు ఈ కార్యక్రమానికి మంలో మెరవనున్నారు. ఈ వేడుకలో వివిధ ఏటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ‘ఖైదీనెం: 150’ చిత్ర దర్శకుడు వివి వినాయక్, చరణ్ తరువాతి సినిమాను డైరెక్ట్ చేయబోయే సుకుమార్ లు కూడా ఈ మెగా ఈవెంట్ కు హాజరవుతున్నారు.