వారణాసిలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా షూటింగ్!


బడా ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తనని తాను స్టార్ హీరోగా ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే బోయపాటి తో జయ జానకి నాయకా సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ హీరో ఇప్పుడు శ్రీ వాస్ దర్శకత్వంలో మరో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వారణాసిలో జరుగుతుంది. దర్శకుడు శ్రీవాస్ బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్డే, అశుతోష్ రాణా మీద సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలో నవరాత్రి పూజా బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాని దర్శకుడు శ్రీ వాస్ యాక్షన్ నేపధ్యంలో సాగీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.