తరువాతి సినిమాను తెలుగులో మాత్రమే చేస్తానంటున్న యంగ్ హీరో !


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’ చిత్రంతో కనడ, తెలుగు ప్రేక్షకులకు ఒకేసారి పరిచయమయ్యాడు యంగ్ హీరో ఇషాన్. సినిమా ఫలితం అంత గొప్పగా లేకపోయినా కూడా డెబ్యూట్ హీరోగా ఇషాన్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి స్పందన వచ్చింది. హీరోగా నిలబడ అన్ని రకాల ఫీచర్స్ అతనిలో ఉన్నాయనే కాంప్లిమెంట్స్ కూడా దక్కాయి. ఈ ఉత్సాహంతోనే ఇషాన్ తన రెండవ చిత్రానికి సిద్దమవుతున్నాడు.

ప్రస్తుతం కొందరు దర్శకులు తనను కలిసి స్క్రిప్ట్స్ చెప్పారని, ఇంకా దేన్నీ ఫైనలైజ్ చేయలేదని, ఒకవేళ చేస్తే వెంటనే ప్రకటిస్తానని చెప్పిన ఇషాన్ ఈ సినిమా కూడా ద్విభాషా చిత్రంగానే ఉంటుందా అంటే కాదని ఈసారి మాత్రం కేవలం తెలుగులోనే సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అలాగే మొదటి సినిమాకే తనకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, ఇదంతా దర్శకుడు పూరి వల్లనేనని కూడా తెలిపారు. అలాగే తనకు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ మాస్టర్ కు కూడా కృతజ్ఞతలు చెప్పడానికి వైజాగ్ వెళుతున్నానని అన్నారు.