ట్రాఫిక్ లో ‘నాటు నాటు’ స్టెప్పులు.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా !

Published on Nov 15, 2021 4:00 pm IST

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. తెలుగు చిత్రసీమను ఏలిన రెండు అగ్ర కుటుంబాల నుంచి వచ్చిన వారసులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా సెకండ్ సాంగ్..నాటు…నాటు ఫుల్ సాంగ్ బుధవారం సాయంత్రం రిలీజ్ అయింది. ఈ సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అభిమానులను సైతం బాగా ఆకట్టుకుంది.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఈ పాటకు ట్రాఫిక్ పడగానే బైక్ దిగి వచ్చిన ఓ కుర్రాడు అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. దాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రేక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ కుర్రాడి స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More