రవితేజ సినిమాకు టెక్నిషియన్స్ ఖరారు !

సోగ్గాడే చిన్నినాయనా & రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ రవితేజతో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి మొదటివారంలో ఈ మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

పిధా సినిమాకు సంగీతం అందించిన శక్తికాంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డిజే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన చోటా కెప్రసాద్ ఈ మూవీకి ఎడిటర్. రామ్ తళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలి ఎమోషన్స్ తో అందరికి నచ్చే విధంగా తియ్యబోతున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.