ఫోటో మూమెంట్: కుటుంబ సభ్యులతో “యంగ్ రెబల్ స్టార్”..!

Published on Sep 26, 2021 8:00 pm IST

డాటర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబీకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ మేరకు ఉప్పలపాటి శ్యామల దేవి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. కూతుర్లతో, మనవడు, మనవరాళ్లు తో దిగిన ఫోటోలు ఉన్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు సైతం కుటుంబ సమేతం గా ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఆది పురుష్ మరియు సలార్ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ విడుదల కి సిద్దం అవుతోంది. డాటర్స్ డే రోజున శ్యామల దేవి ఫోటోలను షేర్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :