ఒకే ఫ్రేమ్ లో నలుగురు క్రేజీ బ్యూటీస్…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on May 22, 2022 11:30 pm IST

సినిమా పరిశ్రమ కి ఇప్పుడు కొత్త తరం హీరోయిన్లు చాలా ఎక్కువమంది వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొందరు మాత్రం కష్టపడుతూ, సినీ పరిశ్రమ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో కొందరు యంగ్ బ్యూటీస్ సాయి పల్లవి, కృతి శెట్టి, కళ్యాణి ప్రియ దర్శిని, ప్రియాంక అరుల్ మోహన్. ఈ నలుగురు హీరోయిన్స్ టాలీవుడ్ లో చాలా క్రేజ్ ను కలిగి ఉన్నారు.

వీరు నలుగురు కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. తాజాగా ఒక వేడుక లో ఈ నలుగురు కలిశారు. అంతేకాక ఒక సెల్పీ దిగారు. ఈ ఫోటో ను నటి కళ్యాణి ప్రియ దర్శిని షేర్ చేయడం జరిగింది. వన్ ఫోటో టు రూల్ దెమ్ ఆల్ అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం. ఏదేమైనా ఈ నలుగురు క్రేజీ బ్యూటీస్ ఒకే ఫ్రేమ్ లో ఉండటం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో ను లైక్, చేస్తూ షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :