మూడు భాషల్లో రాజమౌళి అసిస్టెంట్ మూవీ..!
Published on Jul 8, 2017 9:26 am IST


యంగ్ హీరో నాగ అన్వేష్, అందాల భామ హెబా పటేల్ జంటగా నటిస్తున్నా చిత్రం ఏంజెల్. ఈ చిత్రం గురించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ మరియు హిందీ మూడు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రొమాంటిక్ సోసియో ఫాంటసీ గా ఈ చిత్రం రాబోతోంది.

బాహుబలి 2 చిత్రం తరువాత మూడు భాషల్లో విడుదల కాబోతున్న తెలుగు చిత్రం ఇదే అని చిత్ర యూనిట్ చెబుతోంది. రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పాజ్హాని ఈ చిత్రానికి దర్శకుడు. బాహుబలి మొదటి భాగానికి యితడు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. దర్శకునిగా అతడికి ఇదే తొలిచిత్రం. భువన్ సాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సింధూరపువ్వు కృష్ణా రెడ్డి సమర్పిస్తున్నారు.

 
Like us on Facebook