వైరల్ : మరొక బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్దమైన ఎన్టీఆర్

వైరల్ : మరొక బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్దమైన ఎన్టీఆర్

Published on Nov 22, 2022 2:00 AM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో నటుడిగా గ్లోబల్ గా రీచ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీలో కొమురం భీంగా ఆయన నటనకు అందరినుండి విపరీతమైన ప్రసంశలు దక్కాయి. దాని తరువాత త్వరలో కొరటాల శివతో తన కెరీర్ 30వ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో ఆ మూవీ రూపొందనుంది.

అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో ఎన్టీఆర్ ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించనున్నారు. ప్రముఖ ఫుడ్ బ్రాండింగ్ సంస్థ లిషియస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సరికొత్త యాడ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్లస్టర్ ఎంట్రీ కోసం సిద్ధం అవ్వండి అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ కలర్ ట్రెండీ స్టైల్ సూట్ లో ఉన్న బ్యాక్ సైడ్ పిక్ ని కొద్దిసేపటి క్రితం తమ ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు లిషియస్ సంస్థ వారు. దానితో తమ అభిమాన నటుడి యాడ్ ని చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తూ అప్పుడే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని వైరల్ చేసేస్తున్నారు.

https://www.instagram.com/p/ClOhcBSNToZ/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు