మన దగ్గర కొంతమంది మాస్ హీరోల జాబితా తీస్తే అందులో డెఫినెట్ గా ఉండే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఈ ఎన్టీఆర్ తో మాస్ లోనే సరికొత్త కోణాన్ని చూపించిన పక్కా క్లాస్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరి కాంబోలో వచ్చిన ఫ్యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా “అరవింద సమేత” లో తారక్ లోని మాస్ యాంగిల్ ను సరికొత్తగా ప్రెజెంట్ చెయ్యడంతో ఆ సమయంలో ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయ్యింది.
ఈ కాంబోలో ఇంత మ్యాజిక్ ఉందా అని అనుకున్నారు. దీనితో ఈ కాంబో నుంచి మరో సినిమా వస్తే బాగుణ్ణు అని అంతా అనుకున్న తరుణంలోనే మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు. మరి అలాగే ఈ చిత్రం ఇప్పుడు తారక్ చేస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “RRR” తర్వాత షురూ కానుంది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కనున్న వచ్చే చిత్రం ఇంకొన్ని రోజుల్లోనే ముహూర్తం ఖరారు చేసుకోనుంది అని తెలుస్తుంది. అలాగే సినిమా షూట్ కూడా తొందరలోనే మొదలు కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలపనున్నట్టుగా సమాచారం.
