6 మిలియన్ ఫ్యామిలీలోకి యంగ్ టైగర్.!

Published on Jun 4, 2022 1:01 pm IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి మాసెస్ట్ హీరోలలో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో ప్రపంచ స్థాయి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని తాను అందుకుంటున్నాడు. మరి ఆఫ్ లైన్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఎన్టీఆర్ కి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రేజ్ తో తన ట్విట్టర్ ఖాతా లేటెస్ట్ గా 6 మిలియన్ మార్క్ కి చేరుకుంది. దీనితో తారక్ 60 లక్షల ట్వీటర్స్ ఫ్యామిలీ లోకి చేరాడు. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా తన నెక్స్ట్ రెండు భారీ సినిమాలు అనౌన్స్ కాగా వాటిపై పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అలాగే ముందుగా దర్శకుడు కొరటాల శివతో చేయబోయే తన 30వ ప్రాజెక్ట్ అయితే ఈ జూలై నుంచి స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :