ఎన్టీఆర్ ప్రేమతో అభయ్ రామ్ నవ్వులు !

Published on Nov 21, 2021 5:05 pm IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ ను ఎత్తుకొని దిగిన ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో ఎన్టీఆర్ అభయ్ రామ్ ను ప్రేమగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఇక ఎన్టీఆర్ ప్రేమకు అభయ్ నవ్వుతూ ఉండటం, అలాగే ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ లోని విజువల్స్ బాగున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ తన తండ్రి ప్రేమను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.

దాంతో ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన గంట వ్యవధిలో షేర్ అండ్ లైక్స్ తో తెగ వైరల్ అవుతుంది. మొత్తమ్మీద ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా వీలు చిక్కినప్పుడు కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన తీపి గుర్తులను అభిమానులతో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. జెమినీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తారక్ ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More