యూట్యూబ్ కి కూడా అందని “RRR” హీరోల స్పీడ్.!

Published on Nov 12, 2021 8:03 am IST


ఇప్పుడు మాస్ ఆడియెన్స్ ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఊరమాస్ సాంగ్ “RRR” నుంచి వచ్చిన నాటు సాంగ్. సాలిడ్ అంచనాలుతో వచ్చిన ఈ సాంగ్ ఆ అంచనాలు మ్యాచ్ చేస్తూ అదరగొట్టింది. ఇక అలాగే ఈ సాంగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లపై చూపించిన డాన్స్ బిట్ లు అయితే మైండ్ బ్లోయింగ్.

దీనితో ఈ ఇద్దరు హీరోలు వేసిన ఆ మాస్ స్టెప్పులే ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్ లో వారి డాన్స్ పై యూట్యూబ్ వారే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చెయ్యడం జరిగింది. “హానెస్ట్ గా చెప్పాలి అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ 0.5 స్లో మోషన్ లో పెట్టినా కూడా మేము ఫాస్ట్ గానే ఫీల్ అవుతున్నాం” అని చెప్తున్నారు.

దీనిని బట్టి హీరోల మాస్ డాన్స్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే దీనికి చిత్ర యూనిట్ కూడా బదులిస్తూ మేము ఎడిటింగ్ లో స్పీడ్ గా చేద్దాం అనుకున్నాం కానీ మా హీరోలు అందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని ఇంకో ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More