“రాధే శ్యామ్” వ్యూస్ పై క్లారిటీ ఇచ్చిన యూట్యూబ్.!

Published on Oct 27, 2021 12:03 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “రాధే శ్యామ్” నుంచి రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ అవైటెడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దీనిని రిలీజ్ చేసిన తర్వాత నుంచే భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకొని టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా రికార్డు సెట్ చేసింది.

కానీ తర్వాత ఉన్నట్టుండి టీజర్ వ్యూస్ ఒకే దగ్గర స్టక్ అయ్యిపోవడం వచ్చినవి కూడా తగ్గడం జరిగింది. మరి అభిమానులు అడిగిన ప్రశ్నకే యూట్యూబ్ టీం క్లారిటీ ఇచ్చింది. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది అని అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని తర్వాత అప్డేట్ చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు. దీనితో రాధే శ్యామ్ టీజర్ రెస్పాన్స్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More