యూట్యూబ్ “హిట్ 2” టీజర్ ని తీసేయడంపై అడివి శేష్ క్లారిటీ.!

యూట్యూబ్ “హిట్ 2” టీజర్ ని తీసేయడంపై అడివి శేష్ క్లారిటీ.!

Published on Nov 9, 2022 2:00 PM IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తన మార్క్ ఇంట్రెస్టింగ్ థ్రిలర్స్ చిత్రాల్లో యంగ్ దర్శకుడు శైలేష్ కొలను తో ప్లాన్ చేసిన హార్డ్ హిట్టింగ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2” కూడా ఒకటి. మరి ఈ సినిమాపై కూడా ఇప్పుడు మంచి హైప్ నెలకొనగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ టీజర్ ఆడియెన్స్ ని మరింత థ్రిల్ చేసింది.

అయితే ఈ టీజర్ రిలీజ్ కి ముందే ఇది 18+ ఏజ్ ఉన్న వారికి మాత్రమే అని వార్న్ చేశారు. మరి ఇప్పుడు ఈ అంశం తోనే యూట్యూబ్ నుంచి ఈ టీజర్ ని టెండింగ్ లిస్ట్ నుంచి తొలగించడం అనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై అడివి శేష్ తన రియాక్షన్ ని దీనిపై అసలు ఫ్యాక్ట్ ని రివీల్ చేసాడు.

ఈ టీజర్ 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూసే విధంగా యూట్యూబ్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసారని అందుకే యూట్యూబ్ లో లాగిన్ అయ్యి మీ వయసు 18 దాటి ఉన్నట్టు అయితే అప్పుడు టీజర్ మీకు కనిపిస్తుంది అని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుండగా ఈ చిత్రం నుంచి ఊరికే ఊరికే అనే కొత్త సాంగ్ రేపు రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు