బిగ్‌బాస్‌లోకి యూట్యూబర్ హర్ష సాయి.. క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Published on Jun 10, 2022 1:00 am IST

కష్టాల్లో ఉన్నామంటే ఆదుకునే వాళ్లను చూసుంటారు.. కానీ కష్టాల్లో ఎవరున్నారనేది తెలుసుకుని మరీ ఆదుకునేవాడు ఎవరు అంటే అది యూట్యూబర్ హర్ష సాయి అనే చెప్పాలి. గుడిసెల ముందు నోట్ల కట్టలు పెట్టడం, సరైన ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడం, బార్బర్‌కు షాప్‌ కట్టించడం ఒక్కటేంటి చెప్పుకుంటే పోతే లిస్ట్ చాలానే ఉందండోయ్. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే హర్ష సాయి మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల బిగ్‌బాస్ 6 తెలుగు లోగోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఆ వీడియో కింద అందరూ హర్ష సాయి గురుంచే కామెంట్లు పెడుతున్నారు. హర్ష సాయి బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు, బిగ్‌బాస్‌లోకి వెళ్లి పేరు చెడగొట్టుకోకకండని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా హర్షసాయి స్పందించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని అన్నాడు. అందుకే యూట్యూబ్‌ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్‌లోడ్‌ చేయాలని నియమం పెట్టుకోకుండా నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని హర్ష సాయి చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :