‘మేడ మీద అబ్బాయి, యుద్ధం శరణం’ కృష్ణా కలెక్షన్స్ !


నాగ చైతన్య తాజా చిత్రం ‘యుద్ధం శరణం’ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రారంభాన్ని కాకపోయినా మంచి ఓపెనింగ్స్ నే రాబట్టుకుంది. కానీ మిశ్రమ స్పందన కారణంగా తర్వాత శని, ఆదివారాల్లో చెప్పుకోదగిన భారీ స్థాయి కలెక్షన్స్ రాలేదు. కృష్ణా జిల్లాలో 1వ రిమోజు రూ.12.4 లక్షల, 2వ రోజు రూ.6.09లక్షలు, 3వ రోజు రూ.8. 64 లక్షలు రాబట్టి మొత్తంగా రూ.27.13 లక్షల షేర్ ను నమోదు చేసింది.

ఇక దాంతో పాటే విడుదలైన అల్లరి నరేష్ చిత్రం ‘మేడ మీద అబ్బాయి’ కూడా యావరేజ్ ఓపెనింగ్స్ ను సాధించినా మంచి టాక్ రాకపోవడంతో డీలా పండింది. క్రిష్ణా ఏరియాలో 1వ రోజూ రూ. 5.08 లక్షలు, 2వ రోజు రూ. 4.86 లక్షలు, 3వ రోజు రూ. 7.48 లక్షలతో మూడు రోజులకు గాను రూ. 17.43 లక్షల షేర్ ను వసూలు చేసింది. శని, ఆదివారాలు వారాంతం కాబట్టి పర్వాలేదనిపించిన ఈ రెండు చిత్రాలు ఈరోజు నుండి వర్కింగ్ డేస్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి.