కృష్ణా జిల్లాలో ‘యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి’ వసూళ్ల వివరాలు !


గత వారం విడుదలైన సినిమాల్లో నాగ చైతన్య ‘యుద్ధం శరణం’ పెద్ద చిత్రం. పాజిటివ క్రేజ్ మధ్యన విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది. కృష్ణా జిల్లాలో మొదటిరోజు రూ.12.4 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా రెండవరోజు రూ.6.09లక్షలు రాబట్టి మొత్తంగా రూ.18.51 షేర్ ను ఖాతాలో వేసుకుంది.

ఇక అల్లరి నరేష్ యొక్క ‘మేడ మీద అబ్బాయి’ సినిమా కూడా గత వారమే విడుదలైంది. మొదటి రోజు కృష్ణా ఏరియాలో రూ. 5.08 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా 2వ రోజు రూ. 4.86 లక్షలతో మొత్తంగా రూ.9.95 లక్షల షేర్ ను ఖాతలో వేసుకుంది. ఇకపోతే ఈరోజు ఆదివారం కావడంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఇంకాస్త మెరుగ్గా ఉండే అవకాశాముంది.