“ఇండియన్ 2” కి పోటీగా “యుగానికి ఒక్కడు” నటుడు సినిమా

“ఇండియన్ 2” కి పోటీగా “యుగానికి ఒక్కడు” నటుడు సినిమా

Published on Jul 3, 2024 12:06 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మరోసారి బాక్సాఫీస్ రివైవ్ అయ్యిందని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ ల “కల్కి 2898 ఎడి” దెబ్బకి పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ సినిమా థియేటర్స్ లోకి తరలి వస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అవైటెడ్ గా ఉన్న మరో పాన్ ఇండియా చిత్రం ఏదన్నా ఉంది అంటే అది కల్కి విలన్ యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” అని చెప్పాలి.

ఎన్నో ఏళ్ళు తర్వాత దర్శకుడు శంకర్ తో చేసిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం ఇది కాగా ఇప్పుడు వరకు అయితే ఈ సినిమాతో పోటీగా ఏ సినిమా కూడా వస్తున్నట్టుగా బయటకి రాలేదు. కానీ లేటెస్ట్ గా కోలీవుడ్ మార్కెట్ లోనే ఈ భారీ చిత్రానికి ఓ చిన్న సినిమా పోటీగా వస్తున్నట్టుగా అదే భారతీయుడు 2 రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

మరి ఆ చిత్రం “టీన్జ్” కాగా ఈ చిత్రంలో “యుగానికి ఒక్కడు” ఫేమ్ ప్రముఖ నటుడు పార్థిబన్ ముఖ్య పాత్రలో అలాగే దర్శకునిగా టీన్జ్ కి వర్క్ చేయగా ఈ సినిమాని ఇప్పుడు ఇండియన్ 2 తో పోటీగా అనౌన్స్ చేసి ఫిక్స్ చేశారు. మరి అలాంటి సినిమాతో పోటీగా అంటే సాహసమే అని చెప్పాలి. అయితే టీన్జ్ మేకర్స్ కూడా నమ్మకంగానే ఉన్నారు. ఇక ఈ చిత్రానికి డి ఇమాన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు