బాలయ్య కి యువరాజ్ సింగ్ విషెష్ వైరల్.!

Published on Jun 10, 2023 1:11 pm IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేహాసన లో తెరకెక్కిస్తున్న చిత్రం “భగవంత్ కేసరి” నుంచి సాలిడ్ టీజర్ ని అయితే మేకర్స్ ఇపుడు బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా సినీ వర్గాలు వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుండగా..

లేటెస్ట్ గా అయితే మన ఇండియన్ క్రికెట్ సెన్సేషనల్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అయితే బాలయ్య విషెష్ చెప్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నందమూరి బాలకృష్ణ సర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు సమాజం పట్ల చూపే నిబద్దత అలాగే క్యాన్సర్ హాస్పిటల్ మీ రీసెర్చ్ సెంటర్ తో మమ్మల్ని ఎప్పటికీ ఇన్ స్పైర్ చేస్తున్నారని యువరాజ్ అయితే తమ ఇద్దరిపై ఓ పిక్ షేర్ చేసి తెలియజేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానులు నడుమ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :