టాలీవుడ్‌లో దర్శకుడు వైవీఎస్ చౌదరి అంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్‌గా ఉండేవారు. ఆయన తెరకెక్కించే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేవి. అయితే, ఆయన కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు తిరిగి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. అయితే, ఈసారి నందమూరి ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నటు వైవీఎస్ ఇప్పటికే వెల్లడించారు.
ఈ సినిమాను న్యూ టాలెంట్ రోర్స్ అనే బ్యానర్‌పై ఆయన సతీమణి యలమంచిలి గీత ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. కాగా నందమూరి జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ఆయన గతంలోనే తెలిపారు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ అసలు ఎలా ఉంటాడు అనే విషయాన్ని రివీల్ చేయబోతున్నట్లు వైవీఎస్ అనౌన్స్ చేశారు.
ఎన్టీఆర్ తొలి దర్శనం అక్టోబర్ 30న ఉంటుందని.. నందమూరి అభిమానులకు ఇది కనులపండుగగా ఉండబోతుందని వైవీఎస్ చౌదరి ప్రకటించారు. ఇక ఈ సినిమాను కూడా తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా అన్ని హంగులతో తెరకెక్కించబోతున్నట్లు ఆయన ఇదివరకే తెలిపారు. దీంతో ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడా అనే ఆసక్తి నందమూరి అభిమానుల్లో నెలకొంది.
Dynamic Director @helloyvs is bringing a Massive Surprise from @NewTalentRoars' Prestigious Production No. 1????
Get Ready for the Powerful FIRST DARSHAN of Debutant Hero ????andamuri ????araka ????amarao – The Great-GrandSon of Legendry NTR ????????
This WEDNESDAY – OCTOBER 30th❤️ pic.twitter.com/9Mxg26LSMZ
— NTR @ (@NewTalentRoars) October 25, 2024