రీసెంట్ గా మన టాలీవుడ్ అందించిన మాంచి హిట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ నటించిన సాలిడ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “జీబ్రా” కూడా ఒకటి. దర్శకుడు కార్తిక్ తెరకెక్కించిన ఈ చిత్రం పట్టుబట్టి మరీ సత్యదేవ్ థియేట్రికల్ రిలీజ్ చేయించి హిట్ కొట్టాడు. అయితే మంచి వసూళ్లు కూడా అందుకున్న ఈ సినిమా ఇపుడు ఫైనల్ రన్ కి చేరుకుంది. మరి దీనిపై సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
మా జీబ్రా రన్ కి ఎండ్ కార్డ్ పడింది. థియేటర్స్ లో ఇంతపెద్ద సక్సెస్ ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్లీ ఖచ్చితంగా స్ట్రాంగ్ సినిమాతో వస్తాను అంటూ ప్రామిస్ చేసాడు. మరి లేటెస్ట్ గా పుష్ప 2 రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అండ్ బుకింగ్స్ నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. సో జీబ్రా రన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంది. మొత్తానికి జీబ్రా సక్సెస్ తో ఈ రకంగా సత్యదేవ్ అనందం గానే ఎమోషనల్ అయ్యాడు.
Finally, a happy ending. Thank you for the unconditional love and support for #Zebra. The last two weeks have been exceptional, and emotions have been running high. I’m deeply grateful for each one of you who believed in this film and celebrated it. Thank you for handing me my… pic.twitter.com/yDWMEG77t9
— Satya Dev (@ActorSatyaDev) December 5, 2024