‘హలో వరల్డ్’ పేరుతో న్యూ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన జీ 5

Published on Jul 25, 2022 11:30 pm IST

ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరు ఎక్కువగా తీరిక వేళల్లో నెట్ లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. యూట్యూబ్ తో పాటు మరోవైపు ఓటిటి మాధ్యమాల యొక్క వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. కరోనా తరువాత ఓటిటికి డిమాండ్ మరింతగా పెరగడంతో పలు ఒటిటి సంస్థల వారు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, సిరీస్ లతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

ఆ విధంగా మంచి పేరుతో దూసుకెళ్తున్న ఓటిటి మాధ్యమాల్లో జీ 5 కూడా ఒకటి. ఇటీవల ఒక చిన్న ఫామిలీ స్టోరీ, లూసర్ 2, గాలివాన, రెక్కీ, మా నీళ్ల ట్యాంక్ వంటి వెబ్ సిరీస్ లతో మంచి క్రేజ్ అందుకుంది జీ 5. ఇక లేటెస్ట్ గా వారు ‘హలో వరల్డ్’ అనే సరికొత్త వెబ్ సిరీస్ ని ఆగష్టు 12 నుండి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎనిమిది మంది యువతీ యువకులు ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తూ లైప్ ని లీడ్ చేస్తూ తమ ఫ్యూచర్ గురించి పలు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అనంతరం వారి లైఫ్ లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని శివ సాయి వర్ధన్ జలదంకి తెరక్కించారు. మంచి ఎంటర్టైనింగ్ గా ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ తో సాగనుంది.

గతంలో గీత సుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు సాయి వర్ధన్ దీనిని కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా యువతని అలరించేలా తెరకెక్కించారని అంటోంది యూనిట్. ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి, నిఖిల్ సింహా, అపూర్వ రావు, అనిల్ జీల, స్నేహాల్ కామత్, రవి వర్మ, జయప్రకాశ్ నటించిన ఈ వెబ్ సిరీస్ కి మ్యూజిక్ ని పీకే దండి అందించగా ఎడురోలు రాజు ఫోటోగ్రఫి అందించారు. మరి త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :