ఇంటెన్స్ గా జీ5 లేటెస్ట్ సిరీస్ “రెక్కీ” మోషన్ పోస్టర్.!

Published on Jun 1, 2022 6:04 pm IST

ప్రస్తుతం ఓటిటి ప్రపంచంలో ఉన్న దిగ్గజ స్ట్రీమింగ్ యాప్స్ లో దేనికదే స్పెషల్ కంటెంట్ తో వీక్షకులను ఆకర్షించే పనిలో ఉన్నారు. అలా వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ లు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అలాగే లేటెస్ట్ భారీ సినిమాలను తమ ఓటిటి యాప్ ద్వారా అందిస్తూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న ప్రముఖ సంస్థ జీ 5.

రీసెంట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ “రౌద్రం రణం రుధిరం” తో భారీ ట్రీట్ ఇచ్చిన జీ 5 మరికొన్ని రోజుల్లో మంచి ఇంటెన్స్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సౌత్ ఇండియా సినిమా దగ్గర పలువురు ప్రముఖ నటులు శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ, నరేన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “రెక్కీ” ని పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు.

ఇప్పుడు మేకర్స్ ఈ సిరీస్ పై తమ పాత్రధారులను పరిచయం చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ చేశారు. ఒక్కొక్కరి రోల్ ని వారి లుక్ ని రివీల్ చేస్తూ ప్లాన్ చేసిన ఈ టీజర్ ఆసక్తిగా శ్రీరామ్ మద్దూరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మరింత ఎఫెక్టీవ్ గా ఉంది. మరి ఈ కంప్లీట్ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలి ఈ జూన్ 17 నుంచి ప్రీమియర్స్ వరకు ఆగాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :