“RRR” లో ఎన్టీఆర్ హార్డ్ వర్క్ పై ఇంట్రెస్టింగ్ వీడియో వదిలిన “జీ5”

“RRR” లో ఎన్టీఆర్ హార్డ్ వర్క్ పై ఇంట్రెస్టింగ్ వీడియో వదిలిన “జీ5”

Published on May 23, 2022 1:00 PM IST

లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ “రౌద్రం రణం రుధిరం” కోసం తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి విజన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ కెరీర్ నుంచి దాదాపు నాలుగేళ్లు వదులుకొని ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా వారి అందరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరి హీరోలు చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు.

మరి ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు. దీనిపై లేటెస్ట్ గా ఈ సినిమా సౌత్ వెర్షన్ ఓటిటి హక్కులు తీసుకొని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన జీ 5 వారు ఒక ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో వదిలారు. మరి ఇందులో ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ లో గాని కొమురం భీముడో సాంగ్ కి గాని భీమ్ గెటప్ లో ఎన్టీఆర్ సెట్స్ లో చేసిన ఫీట్ లు గాని ఓ రేంజ్ లో ఉన్నాయి. దీనితో ఈ కొత్త వీడియో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు