“వకీల్ సాబ్”, “బంగార్రాజు” విషయంలో జీతెలుగు కి ఈ అవార్డ్స్.!

Published on Sep 24, 2022 7:59 am IST

గత ప్యాండమిక్ టైం లో తెలుగు సినిమా దగ్గర వచ్చి మంచి హిట్స్ గా నిలిచినటువంటి చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” అలాగే తర్వాత ఏడాది అలాంటి కరోనా పరిస్థితిలోనే వచ్చిన అక్కినేని వారి క్రేజీ మల్టీ స్టారర్ “బంగార్రాజు” కూడా థియేటర్లు లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి.

ఇక ఈ రెండు సినిమాల తాలూకా శాటిలైట్ హక్కులు అయితే ప్రముఖ ఛానెల్ జీ తెలుగు వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు గాను కొన్ని క్యాటగిరీస్ లో తమ ఛానెల్ కి అవార్డ్స్ వచ్చినట్టుగా వారు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు.

ఇండియన్ మార్కెటింగ్ సౌత్ అవార్డ్స్ లో బెస్ట్ యూజ్ ఆఫ్ టీవీ – మీడియాలో భాగంగా వకీల్ సాబ్ కి జజీ తెలుగు చేసిన ప్రమోషన్స్ కి గాను గోల్డ్ క్యాటగిరీ అవార్డు వారికి లభించిందట, అంతే కాకుండా ప్రయోగాత్మక మార్కెటింగ్ లో ఇదే చిత్రానికి బ్రాంజ్ అవార్డు కూడా వచ్చిందని వారు తెలిపారు.

ఇక ఈ ఏడాదిలో అయితే సీజనల్ మార్కెటింగ్ విభాగంలో అయితే “బంగార్రాజు” సినిమాకి గోల్డ్ అవార్డు వచ్చినట్టు వారు తెలిపారు. మొత్తానికి అయితే ఇలా ఈ రెండు చిత్రాలు ఈ ఛానెల్ కి మంచి పేరు తెచ్చాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :