మరో క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న జీ5..!

Published on Jun 3, 2022 12:00 am IST

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ5 ఓటీటీ’ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లు దూసుకుపోతోంది. ఇటీవలే ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శ్రీరామ్, శివబాలాజీ నటించిన ‘రెక్కీ’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ జూన్ 17 నుంచి జీ 5లో అందుబాటులోకి రాబోతుంది. 1990ల నాటి పీరియడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ 7 ఎపిసోడ్‌లుగా రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు. ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి చేధించాడు అనేదే ఈ కథ ప్రధానాంశమని చెప్పుకొచ్చాడు. ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఈ సిరీస్‌ వీక్షకులను ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం :