ఓటిటి లో బ్రేకుల్లేకుండా పరుగులు పెడుతున్న ‘పులి మేక’

Published on Mar 17, 2023 3:05 am IST

యువ నటుడు ఆది సాయికుమార్, అందాల నటి లావణ్య త్రిపాఠి తొలిసారిగా ఓటిటి కి ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ పులి మేక. చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ సిరీస్ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి తొలి రోజు నుండే మంచి రెస్పాన్స్ అందుకుంది. సుమన్, రాజా చెంబోలు, గోపరాజు రమణ, ముక్కు అవినాష్, స్పందన పల్లి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ని జీ 5 వారితో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థ పై కోన వెంకట్, శ్రావ్య కోన నిర్మించారు.

ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సిరీస్ కి ప్రస్తుతం జీ 5 లో మరింత బాగా రెస్పాన్స్ లభిస్తోంది. ఇటీవల 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసిన ఈ సిరీస్ తాజాగా ఏకంగా 120 స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిందని జీ 5 వారు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. కాగా తమ సిరీస్ కి ఇంత మంచి ఆదరణ అందిస్తున్నందుకు పులి మేక టీమ్ ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తోంది.

సంబంధిత సమాచారం :