జీరో బజ్ తో స్టార్ హీరో సినిమా.. ఇక రీమేక్స్ ఆపేస్తే మంచిదా?

జీరో బజ్ తో స్టార్ హీరో సినిమా.. ఇక రీమేక్స్ ఆపేస్తే మంచిదా?

Published on Jul 10, 2024 8:55 AM IST

నార్త్ సినిమా మార్కెట్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా ఒకరు. మరి అక్షయ్ అయితే ఎప్పుడు నుంచో హిట్ కోసం చూస్తున్నాడు కానీ అది మాత్రం దక్కడం లేదు. రీసెంట్ గా తాను నటించిన భారీ చిత్రం “బడే మియా చోటే మియా” రిలీజ్ కి వచ్చింది కానీ అది మరీ అంతగా రాణించలేదు.

ఇక ఈ సినిమా తర్వాత తాను నటించిన మరో చిత్రమే “సఫారియా” (Safariya) ఎల్లుండే రిలీజ్ కి రాబోతుంది కానీ ఇపుడు ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్ లో మినిమమ్ బజ్ కూడా కనిపించడం లేదు. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాకి ఉండాల్సిన కనీస బుకింగ్స్ కూడా కనిపించట్లేదని టాక్. అయితే గత కొంత కాలం నుంచి అక్షయ్ చేసిన ఏ రీమేక్ కూడా రాణించలేదు.

ఇది కోలీవుడ్ హిట్ సూర్య (Suriya) నటించిన ఆకాశం నీ హద్దురా కి రీమేక్ అయినప్పటికీ ఆడియెన్స్ ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. దీనితో బాలీవుడ్ ప్రేక్షకులు రీమేక్ సినిమాల పట్ల పెద్దగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. మరి స్టార్స్ ఇంకా వాటి వెనకే తిరుగుతున్నారు. మరి చూడాలి ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు