ధృవ చూసిన తరువాత మెగాస్టార్ రియాక్షన్ ఇది..!

14th, December 2016 - 08:25:25 AM

chiru-ram-charan
రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంగళవారం కూడా దీని హవా ఎక్కడా తగ్గలేదు. మంగళవారం కూడా దీని హవా ఎక్కడా తగ్గలేదు. మల్టిప్లెక్స్ లలో, ‘ఏ’ సెంటర్ లలో ఈ చిత్రం మంచి కలెక్షన్ లను రాబడుతోంది. కాగా మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రాన్ని చూశారు. చిత్రం అద్భుతంగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ధృవ చిత్రాన్ని చూసిన వెంటనే చిరు మొదట దర్శకుడు సురేందర్ రెడ్డి ని ప్రశంసలతో ముంచెత్తారు. సురేందర్ రెడ్డి అద్భుతమైన దర్శకుడంటూ కితాబిచ్చారు. సర్ సురేందర్ రెడ్డి చాలా మంచి భవిష్యత్తు ఉందని చిరు అన్నారు. ధృవ చిత్రం బావుందంటూ చిరు కితాబివ్వడంతో సురేందర్ రెడ్డి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.