ఫోటోమూమెంట్ : తన రెండేళ్ళ కుమారిడితో గోపీచంద్

Published on Oct 13, 2016 4:05 pm IST

gopihand

హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. త్వరలోనే విడుదల కానున్న ‘ఆక్సీజన్‌తో కలుపుకొని మరో రెండు ప్రాజెక్టులను సెట్స్‌పై ఉంచారు. ఇక కెరీర్ ఇలా ఉంటే ఇటు వ్యక్తిగత జీవిత పరంగానూ గోపీచంద్ చాలా హ్యాపీగా ఉన్నారు. రెండేళ్ళ క్రితం విరాట్ కృష్ణకు జన్మనిచ్చి తండ్రైన గోపీచంద్, తన చిన్ని కుమారుడు ఎదుగుతూ ఉండడం చూసి మురిసిపోతున్నారు. నేడు విరాట్ కృష్ణ తన రెండో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గోపీచంద్ తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ విరాట్ కృష్ణతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. తన చిన్ని కుమారుడితో కలిసి స్టార్ హీరో గోపీచంద్ దిగిన ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది కదూ..!?

సంబంధిత సమాచారం :