ఫోటో మూమెంట్ : ‘మెగా’ పార్టీలో స్టార్ హీరోల సతీమణుల సందడి!

Published on Aug 25, 2016 6:24 pm IST

star-wifes
స్టార్ హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న గొడవలు సంచలనం రేపుతున్న నైపథ్యంలో వాళ్ళు అంతగా అభిమానిస్తున్న హీరోలు, వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలు అభిమానులకు పాఠంగా మారుతున్నాయి. తాజాగా జరిగిన మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలకు అందరు అగ్రహీరోలు కుటుంబాలతో సహా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల సతీమణులైన నమ్రత, స్నేహ, ఉపాసనలు ఏంతో అన్యోన్యంగా ఉంటూ సందడి చేశారు. ఈ దృశ్యం స్టార్ హీరోల భార్యలే అంత స్నేహంగా ఉన్నప్పుడు హీరోల అభిమానులు మాత్రం అనవసరపు కారణాలతో ఎందుకు గొడవలుపడుతున్నారు అనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.

సంబంధిత సమాచారం :