యూఎస్ఏ మార్కెట్లో తన స్థాయి పెరగాల్సిందే అంటున్న స్టార్ హీరో

Published on Mar 8, 2020 1:39 pm IST

కొందరు స్టార్ హీరోలకు సొంత రాష్ట్రాల్లో భీభత్సమైన క్రేజ్, మార్కెట్ ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం ఆ స్థాయి మార్కెట్ రేంజ్ అంతగా ఉండదు. అలాంటి హీరోల్లో తమిళ స్టార్ హీరో విజయ్ ఒకరు. తమిళనాట భారీ మార్కెట్ ఉన్నా, వరుసగా రూ.100 కోట్ల వసూళ్లు సాధిస్తున్నా యూఎస్ఏ మార్కెట్లో మాత్రం ఆయన సినిమాలు ఆ రేంజ్ వసూళ్లను అందుకోలేకపోతున్నాయి. దీని నుండి బటయపడి, మార్కెట్ రేంజ్ పెంచుకోవాలని విజయ్ ఎన్నాళ్లగానో ట్రై చేస్తున్నారు.

విజయ్ గత చిత్రాలు ‘తేరి, సర్కార్, మెర్సల్, బిగిల్’ యూఎస్లో మిలియన్ మార్క్ టచ్ చేయగా వాటిలో ‘మెర్సల్’ మాత్రమే అత్యధికంగా 1.3 మిలియన్ మార్క్ చేరుకుంది. తన కొత్త చిత్రం ‘మాస్టర్’తో దాన్ని బీట్ చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఈ సినిమా యూఎస్ హక్కులు 550,000 డాలర్లకు అమ్ముడయ్యాయి. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 1.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేయాలి. ఇక లాభాలు చూడాలంటే 2 మిలియన్ వరకు వసూలు చేయాల్సి ఉంటుంది.

మొత్తానికి ఈసారి విజయ్ 2 మిలియన్ మైలురాయిని తప్పక చేరుకోవాలన్నమాట. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై తమిళ ప్రేక్షకుల్లోనే కాక తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :

More