సమీక్ష : ఆనందం మళ్ళీ మొదలైంది – ఆనందానికి కాదు, నరకానికి కేరాఫ్ అడ్రస్.!

సమీక్ష : ఆనందం మళ్ళీ మొదలైంది – ఆనందానికి కాదు, నరకానికి కేరాఫ్ అడ్రస్.!

Published on Mar 6, 2015 9:13 PM IST
Anandam Malli Modalaindi

విడుదల తేదీ : 6 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

దర్శకత్వం : ఆకాష్

నిర్మాత : ఎన్.జె రాత్నావత్

సంగీతం : సుమన్ జూపూడి

నటీనటులు : ఆకాష్, ఏంజెల్ సింగ్, అలేఖ్య, జియాఖాన్…

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందం’ సినిమా ద్వారా ఆకాష్ తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆకాష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చేసిన సినిమా ‘ఆనందం మళ్ళీ మొదలైంది’. ఈ సినిమా ఆనందం సినిమాకి సీక్వెల్ గా రూపొందించారు. ఎన్.జె రాత్నావత్ నిర్మించిన ఈ సినిమాలో ఏంజెల్ సింగ్, అలేఖ్య, జియాఖాన్ లు హీరోయిన్స్ గా నటించారు. ఆకాష్ ఈ సినిమా తనకి హీరోగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు. మరి ఈ ఆనందం మళ్ళీ మొదలైంది ఆకాష్ కి పూర్వ వైభవాన్ని ఇచ్చిండా లేక బాక్స్ ఆఫీసు ఫ్లాప్స్ స్టార్ గానే మిగిల్చిందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమాలోని పాత్రలని ఆనందం సినిమాలోని కొన్ని పాత్రలకి కొనసాగింపుగా చూపించారు. ఆకాష్(ఆకాష్) – సప్తగిరి(సప్తగిరి) – శర్మ(బాషా) వీరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వీరి ముగ్గురికి పెళ్లి అయ్యి ఉంటుంది. కానీ ఈ ముగ్గురికి తమ భార్యలపై ప్రేమ ఉన్నా వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. అందుకే ఓ రోజు కొద్ది రోజులు గోవా వెళ్లి ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. అలా మొదలైన వీరి జర్నీ మధ్యలో వీరితో పాటు అలేఖ్య(అలేఖ్య), ఏంజిల్ (ఏంజిల్ సింగ్) జాయిన్ అవుతారు. కానీ అలేఖ్య – ఏంజిల్ వల్ల ఆకాష్ – శర్మ – సప్తగిరిలు ఇబ్బందిలో పడతారు. ఆ ఇంబ్బందుల నుండి ఈ ముగ్గురు ఎలా గట్టెక్కి తమ భార్యలను చేరుకున్నారు.? అసలు అలేఖ్య – ఏంజిల్ ఎవరు.? ఎందుకు ఆకాష్ ని అతని ఫ్రెండ్స్ ని ఇబ్బందులు పడేలా చేసారు? అనేది మీరే సినిమా చూసి తెలుసుకోండి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది దేవీశ్రీ ప్రసాద్ అందించిన ‘ఆనందం’ సినిమా సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టకుండా.. దాదాపు సినిమాలో సగానికిపైనే ‘ఆనందం’ సినిమాలోని సాంగ్స్ ని రిపీటెడ్ గా బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించాడు. సినిమా చూడడం కష్టంగా ఉన్నా ఈ పాటలు మాత్రం కళ్ళు మూసుకున్నవారికి కాస్త రిలీఫ్ ని ఇస్తాయి. అందుకే ఇదే మొదటి ప్లస్ పాయింట్. ఇక సినిమా పరంగా ఏంజిల్ సింగ్ సీన్స్ లో, పాటలో బాగా అందాలు ఆరబోసి ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంది. అలాగే జియాఖాన్ కూడా మొదటి సాంగ్ లో అందాలతో ఆకట్టుకుంది. ఇక చివరిగా ఈ సినిమా ఆనందం అనే సినిమాకి సీక్వెల్ అని చెప్పి ప్రమోట్ చేసుకోవడం కూడా ఒకరకమైన ప్లస్ అనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కి గురించి ఇక ఏమీ చెప్పలేదు కాబట్టి.. నటీనటుల నుంచి 24 క్రాఫ్ట్స్ లోని అందరూ ఈ సినిమాని తమ టాలెంట్ తో నాశనం చేసేసారు. ఈ సినిమా ఎఫెక్ట్ వలన ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిన నాకు ఏమి గుర్తోచ్చాయో అవి చెప్తాను. నటీనటుల్లో ఒక్కరు కూడా వీళ్ళ పెర్ఫార్మన్స్ చూడచ్చు అనేలా చెయ్యలేదు. కాబట్టి ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం దండగ. కనీసం నటించకపోతే పోయారు.. వారి వారి పాత్రలకు వారుకూడా డబ్బింగ్ చెప్పుకోకపోవడం ఈ సినిమాకి మైనస్. సప్తగిరి, చిత్రం శీను, సత్యం రాజేష్, శివారెడ్డి లాంటి కమెడియన్స్ చేత డబ్బింగ్ కూడా చెప్పించలేదు.. అంతే కాకుండా దాదాపు అందరికీ ఒకరి చేత డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో చెప్పించేసారు. దానికి తోడు ప్రోపర్ డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, డిటిఎస్ మరియు రీ రికార్డింగ్ కూడా సరిగా చేయకపోవడం వలన డైలాగ్స్ మరీ లౌడ్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే థియేటర్ లో ఉన్నట్టు ఉండదు.. ఏదో పొలిటికల్ మీటింగ్ లో 100 మైక్ సెట్స్ మధ్య కూర్చున్నట్టు ఉంటుంది.

ఇక ఈ సినిమా టెక్నికల్ పరంగా కూడా అన్నీ మైనస్ లే.. కథ అనేది ఏమీ లేదు.. ఏదో నిర్మాత చేత డబ్బులు ఖర్చు పెట్టించాలి కాబట్టి ఒక సొల్లు కథ చెప్పారు. స్క్రీన్ ప్లే అనేది ఏమీ రాసుకున్నట్టు లేరు. చెప్పాలంటే ఈ మధ్య వచ్చే బిలో యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్ లో దీనికన్నా బెటర్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ క్వాలిటీగా ఉంటున్నాయి. ఆనందం సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ ఇందులో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిలే పెద్ద టార్చర్. పాటలు ఎందుకోస్తాయో, ఎందుకు వేల్తాయో అర్థం కాదు. ఒక ఏడుపు సాంగ్ రావాల్సిన ప్లేస్ లో రొమాంటిక్ హాట్ హాట్ డ్యూయెట్ సాంగ్ ఎందుకు పెట్టాడో మన ఆకాష్ బాబుకే తెలియాలి.. ఓవరాల్ గా ఆకాష్ డైరెక్షన్ సినిమాకి మరో పెద్ద మైనస్..

సాంకేతిక విభాగం :

సాంకేతిక డిపార్ట్ మెంట్ లో బాగుంది అని చెప్పుకోదగినవి ఏమీ లేదు. కథ – ఈ కథ కన్నా చిన్న పిల్లలకి చెప్పే చందమామ కథలు బాగుంటాయి. స్క్రీన్ ప్లే – అసలు రాయలేదు. డైరెక్షన్ – వరస్ట్.. ఈ మూడింటితో పాటు హీరోగా కూడా చేసిన ఆకాష్ సినిమాని ఫ్లాప్ గా మలిచాడు. చక్రి సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. ఒక్క విజువల్ కూడా చూసేలా లేదు. సుమన్ జూపూడి మ్యూజిక్. పాటలని ఒక మాదిరిగా ఇచ్చాడు, పిక్చరైజేషన్ చెత్తగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీటన్నిటికన్నా చెత్తగా ఉంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆనందం పాటల్ని బ్యాక్ గ్రౌండ్ లో వాడడం ఏదైతే ఉందో.. అది మాటల్లో చెప్పలేనిది. ఇన్ని బాలేనప్పుడు ఎడిటింగ్ మాత్రం ఎలా బాగుంటుంది చెప్పండి. నిర్మాణ విలువలు కూడా మరీ నాశిరకంగా ఉన్నాయి. గోవా ఎపిసోడ్ ని గోవాలో చూపకుండా ఎక్కడో చూపించి మధ్య మధ్యలో ఏదో సినిమాలలోని గోవా బీచ్ షాట్స్ ని వేయడం ఆడియన్స్ ని ఇంకా చిరాకు పెడతాయి.

తీర్పు :

చాలా కాలం నుంచి హిట్ కోసం బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేస్తున్న ఆకాష్ చేసిన ‘ఆనందం మళ్ళీ మొదలైంది’ సినిమా కూడా ఆకాష్ కి ఫ్లాప్ నే ఇచ్చింది. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆకాష్ ఫెయిల్ అయ్యాడు. సినిమా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఆనందం పాటలు, హీరోయిన్స్ అందాలు తప్ప మిగతా ఏవీ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఆనందం మళ్ళీ మొదలైంది అని వచ్చిన ఈ సినిమా చూస్తున్న, చూసిన ఆడియన్స్ కి నరకంలోని టార్చర్ ని పరిచయం చేస్తుంది. కావున దీనికి దూరంగా ఉండడమే మీ ఆరోగ్యానికి మంచిది..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు