ఆడియో సమీక్ష : మిర్చి – మళ్ళీ అదరగొట్టిన దేవీ శ్రీ ప్రసాద్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ మిర్చి’ సినిమా ఆడియో వేడుక వేలాది మంది అభిమానుల సందడితో నిన్న హైదరాబాద్లో జరిగింది. ఇండస్ట్రీలో వరుస మ్యూజిక్ హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో అన్ని పాటలని రామజోగయ్య శాస్త్రి రాశారు. ప్రభాస్ సరసన అనుష్క – రిచా గంగోపాధ్యాయ జోడీ కట్టారు. మిర్చి ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలు ఉన్నాయి. ఫిబ్రవరిలో విడుదల కావడానికి సిద్దమవుతున్న ఈ సినిమా ఆడియో ఆల్బం ఎలా ఉందో ఇప్పుడో చూద్దాం..

1. పాట : పండగలా
గాయకుడు : కైలాష్ ఖేర్
రచయిత : రామజోగయ్య శాస్త్రి
ఇది బాగా ఎమోషనల్ గా ఉండే పాట, హీరో మళ్ళీ తన గ్రామానికి తిరిగి వచ్చి తన జనం కోసం అండగా నిలబడ్డప్పుడు ఈ పాట ఉండే అవకాశం ఉంది. కైలాష్ ఖేర్ తన వాయిస్ తో సూపర్బ్ గా పాడిన ఈ పాటకి దేసీ శ్రీ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ట్రెడిషనల్ వాయిద్యాలను ఈ పాటలో బాగా ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగుంది. వినడానికి ఇదొక మంచి పాట.

 

2. పాట : బార్బీ గర్ల్
గాయనీ గాయకులు : జస్ప్రీత్ జాస్, సుచిత్ర
రచయిత : రామజోగయ్య శాస్త్రి
‘బార్బీ గర్ల్’ – 4 నిమిషాల పాటు పెప్పీగా సాగే డ్యూయెట్ సాంగ్, జస్ప్రీత్ జాస్ – సుచిత్ర వాయిస్ కూడా ఈ పాటకి తగ్గట్టుగానే ఫుల్ ఎనర్జీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఓకే. ఈ పాటలోని డ్రం బీట్స్ నాగార్జున ‘ఢమరుకం’ సినిమాలోని ‘రెప్పలపై’ సాంగ్ ని గుర్తుకుతెస్తాయి. పాటలో మ్యూజిక్ పెప్పీగా ఉంటూ, అలాగే ఈ పాటలో పెర్కుషన్ వాయిద్యాల సౌండ్ దామినేటింగ్ గా ఉంటుంది. మొత్తంగా ఈ పాట నిధానంగా అందరికీ నచ్చుతుంది.

3. పాట : డార్లింగే డార్లింగే
గాయనీ గాయకులు : దేవీ శ్రీ ప్రసాద్, గీతా మాధురి
రచయిత : రామజోగయ్య శాస్త్రి
‘డార్లింగే’ పాట సినిమాలో మాస్ సాంగ్, ఈ పాటని ముందు బెంచ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేసారు. దేవీ శ్రీ ప్రసాద్ – గీతా మాధురి వాయిస్ పాటకి తగ్గట్టు ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఓకే అనేలా ఉంది. ఈ పాటలో దేవీ శ్రీ మ్యూజిక్ ఎంతో మోటుగా, మాస్ కి వెంటనే ఎక్కేలా ఉంది. ఈ పాటని కొన్ని సార్లు వింటే దీనికి అడిక్ట్ అవుతారు. పాటకి విజువల్స్ కూడా తోడైతే మాస్ హిట్ గా నిలిచిపోతుంది.

 

4. పాట : ఇదేదో బాగుందే
గాయనీ గాయకులు : విజయ్ ప్రకాష్, అనిత
రచయిత : రామజోగయ్య శాస్త్రి
ఆల్బంలో చాలా కూల్ గా, లవ్లీగా సాగిపోయే మెలోడీ సాంగ్ ‘ఇదేదో బాగుందే’. విజయ్ ప్రకాష్ – అనిత ఎంతో మెలోడియస్ గా సూపర్బ్ గా ఈ పాటకి తమ గాత్రాన్ని అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చక్కగా, వినగానే నచ్చేలా ఉంది. ఈ పాటని ఖచ్చితంగా అందమైన లోకేషన్స్ లో, బ్యూటిఫుల్ గా షూట్ చేసి ఉంటారు. దేవీ శ్రీ మ్యూజిక్ చాలా మెలోడీగా ఉంటూ, సాంగ్ పేస్ కూడా చాలా బాగుంది. ఆల్బంలో మంచి సాంగ్, అలాగే క్లాస్ ఆడియన్స్ ని, మెలోడీ సాంగ్స్ ఇష్టపడేవారికి ఈ పాట విపరీతంగా నచ్చేస్తుంది.

5. పాట : మిర్చి మిర్చి
గాయని : చిన్న పొన్ను
రచయిత : రామజోగయ్య శాస్త్రి
ఇది సినిమాలో ఒక బిట్ సాంగ్.. చిన్న పొన్ను వాయిస్ పాటకి తగ్గట్టు ఉంది. మామూలుగా ఇలాంటి పాటలని హీరోని ఎలివేట్ చేయడానికి ఉపయోగిస్తారు.

 

 

 

6. పాట : నీ చూపులా
గాయకుడు : కైలాష్ ఖేర్
రచయిత : రామజోగయ్య శాస్త్రి
సినిమాలోని ఈ బిట్ సాంగ్, ఇదే ఆల్బంలోని ‘పండగలా’ సాంగ్ కి ప్రింటు గుద్దినట్టు ఉంటుంది. ఈ పాటలో ఆశ మరియు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పదాలతో పాటు బాగా బాధలో ఉన్నవారి ఫీలింగ్స్ అన్నీ కలగలిపి ఈ పాటని రాసారు. ఈ పాట సినిమాలో ఏదైనా భాదాకరమైన సన్నివేశం వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు.

7. పాట : యాహూ యాహూ
గాయకుడు : మిక
రచయిత : రామజోగయ్య శాస్త్రి
‘యాహూ యాహూ’ పాట ఖచ్చితంగా సినిమాలో ప్రభాస్ కి ఇంట్రడక్షన్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ పాట పాడిన మిక వాయిస్ ఎంతో ఎనర్జిటిక్ గా పాటకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్లో లిరిక్స్ ఎలా ఉండాలో అలానే రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఉంది. దేవీ శ్రీ మ్యూజిక్ వినగానే నచ్చేలా, పెప్పీగా ఉంది. పెర్క్యుషన్ వాయిద్యాల సౌండ్ ని డామినేట్ చేసాయి. మొత్తంగా ఈ పాట బాగుంది.

 

తీర్పు :

2013 సంవత్సరాన్ని దేవీ శ్రీ ప్రసాద్ ‘మిర్చి’ లాంటి సూపర్బ్ ఆడియో ఆల్బం తో మొదలుపెట్టాడు. ఈ ఆల్బంలో అందరూ హమ్ చేసుకునేలాగా ఉండే పాటలను ఇచ్చాడు, అలాగే పెద్దగా ప్రయోగాత్మక ట్యూన్స్ కూడా ట్రై చెయ్యలేదు. ట్యూన్స్ వినగానే బాగున్నాయి అని మెచ్చుకునేలా ఉన్నాయి. ఈ ఆల్బం నుంచి నేను పిక్ చేసే సాంగ్స్ ‘ఇదేదో బాగుందే’, ‘పండగలా’, ‘బార్బీ గర్ల్’, ‘డార్లింగే’.ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో మరో మంచి మ్యూజిక్ ఆల్బం మనకి అందించాడు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా విజయానికి ఈ ఆల్బం చాలా హెల్ప్ అవుతుంది.

Click Here For English Audio Review

సంబంధిత సమాచారం :

More