ఆడియో సమీక్ష : నేను శైలజ – ఫీల్ గుడ్ ఆల్బమ్.!

ఆడియో సమీక్ష : నేను శైలజ – ఫీల్ గుడ్ ఆల్బమ్.!

Published on Dec 22, 2015 9:36 PM IST

Nenu-Sailaja
యంగ్ హీరో రామ్ కమర్షియల్ ఫార్మాట్ అనే దాన్ని పక్కన పెట్టి ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రమ్ గా చేసిన సినిమా ‘నేను శైలజ’. తండ్రి – కుమార్తెల మధ్య ఉన్న అనుభందాన్ని మెయిన్ పాయింట్ గా చేసుకొని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్నే ఘనంగా రిలీజ్ అయ్యింది. మొత్తం 6 పాటలున్న ఈ ఆల్బమ్ లో 5 మెయిన్ సాంగ్స్ అయితే ఒకటి మాత్రం బిట్ సాంగ్. మరి ఈ ఆల్బమ్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

011. పాట : నైట్ ఈజ్ స్టిల్ యంగ్
గాయకుడు : డేవిడ్ సైమన్
సాహిత్యం : సాగర్

‘నేను శైలజ’లో మన హీరో నైట్ క్లబ్ లో ఒక డిజేగా కనిపిస్తాడు.. ఆ పాత్రని జస్టిఫై చేస్తూ పబ్ లో సాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇదని ఫస్ట్ బీట్ వినగానే చెప్పేయచ్చు. నేటితరం యువతని బేస్ చేసుకొని నైట్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తూ, హీరో పాత్రని ప్రెజంట్ చేస్తూ సాగర్ బాగానే పాట రాసాడు. దేవీశ్రీ ప్రసాద్ డిజే అనే దాన్ని తలపిస్తూ సాంగ్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత డ్రమ్ బీట్స్ తో సాంగ్ లో మంచి ఊపు తెస్తూ మధ్య మధ్యలో ఎలక్ట్రిక్ గిటార్స్ సౌండ్ ని మిక్స్ చేసిన విధానం బాగుంది. ఈ పబ్ సాంగ్ కి పాప్ కల్చర్ స్టైల్లో ఉన్న డేవిడ్ సైమన్ వాయిస్ బాగానే సెట్ అయ్యింది. ఓవరాల్ గా దేవీశ్రీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మచి స్టెప్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ట్యూన్ ఇచ్చాడు. ఫాస్ట్ బీట్ అండ్ పబ్ సాంగ్స్ నచ్చేవారికి ఈ సాంగ్ నచ్చుతుంది.

2. పాట : క్రేజీ ఫీలింగ్02
గాయకుడు : పృధ్వీ చంద్ర
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

ఫస్ట్ టీజర్ తో రిలీజ్ అయిన ఈ సాంగ్ లోని ట్యూన్ ఇప్పటికే చాలా మంది రింగ్ టోన్స్ గా మారిపోయింది. కీ బోర్డ్ తో ట్యూన్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి లో పిచ్ ట్రంపెట్ సౌండ్ ని మిక్స్ చేస్తూ చేసిన ట్యూన్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోని ప్రతి అమ్మాయి రిజెక్ట్ చేస్తున్న టైంలో ఒక సూపర్ అమ్మాయి తను ఇష్టం అంటే ఆ అబ్బాయి ఫీలింగే వేరు. అలాంటి సందర్భంలో వచ్చే పాటే ఈ క్రేజీ క్రేజీ ఫీలింగ్ సాంగ్. ఈ సాంగ్ లో స్పెషల్ క్రెడిట్స్ పాట రాసిన రామజోగయ్య శాస్త్రికి ఇవ్వాలి. ఒక అబ్బాయికి రోజూ పరిచయం ఉండే వస్తువులను, పరిసరాలను, మనుషులను వాడుకుంటూ తన ఫీలింగ్ ని వ్యక్తపరిచే ఫార్మాట్ లో రాసిన సాహిత్యం అదుర్స్. అలాంటి పాటకి దేవీశ్రీ కీ బోర్డ్, ట్రంపెట్, డ్రమ్స్ మరియు గజల్స్ వాడి ప్రాణం పోసాడు. ఇక పృధ్వీ చంద్ర పాడిన విధానం ఎలా ఉందంటే వింటుంటేనే విజువల్స్ కళ్ళముందు కదులుతాయి. దీన్ని బట్టే తను ఎంత బాగా పాడాడో చెప్పేయచ్చు. డాన్సులతో కాకుండా సీన్స్ తో కంపోజ్ చేసిన ఈ పాట విజువల్స్ పరంగా ఇంకా సూపర్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఆల్బమ్ లో వినగానే నచ్చేసే సాంగ్ ఇది.

033. పాట : మస్తీ మస్తీ
గాయనీ గాయకులు : సూరజ్ సంతోష్, శ్వేత మోహన్
సాహిత్యం : అనంత శ్రీరామ్

హీరో – హీరోయిన్ మధ్య పరిచయం పెరిగి, పరిచయం కాస్తా ప్రేమగా మారుతున్న టైంలో వారి లైఫ్ లో కలిగే మధురానుభూతులను బేస్ చేసుకొని వచ్చే మొదటి డ్యూయట్ సాంగ్ ‘మస్తీ మస్తీ’. హీరో – హీరోయిన్ లు ఒకరివల్ల ఒకరు పొందుతున్న ఆనందాన్ని వ్యక్తపరిచే ఈ పాటకి అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం చాలా బాగుంది. సూరజ్ సంతోష్ – శ్వేత మోహన్ ల వాయిస్ ఈ పాటకి పెద్ద హెల్ప్ అయ్యిందని చెప్పాలి. ఇక దేవీశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కోసం కొత్తగా ఏమీ ట్రై చెయ్యలేదు. ఇదే తరహాలో సాగే పలు పాటలను దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఇప్పటికే విన్నాం. కావున ట్యూన్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు. లవ్ ఫీల్ తో షూట్ చేసిన సీన్స్ వలన ఈ సాంగ్ వినడం కన్నా విజువల్ గా బాగుంటుందని చెప్పవచ్చు.

4. పాట : శైలజ శైలజ04
గాయకుడు : సాగర్
సాహిత్యం : భాస్కర భట్ల

హీరో ప్రేమని హీరోయిన్ కాదని వెళ్ళిపోతే, ఆ బాధలో గడ్డం పెంచుకొని రోడ్ల మీద తిరుగుతూ పాడే పాటే ఈ ‘శైలజ శైలజ’ అనిసాగే టైటిల్ సాంగ్. ఈ సాంగ్ హైలైట్ భాస్కర భట్ల రాసిన సాహిత్యం. మామూలుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనగానే బాగా బాధాకరమైన పదాలను ఉపయోగించి రాస్తారు కానీ ఈ పాటలో భాస్కర భట్ల హీరో – హీరోయిన్ లు కలిసి తిరిగిన ప్రదేశాలను, వారి జ్ఞాపకాలను పొందు పరుస్తూ అవేవీ మారలేదు కానీ శైలజ మాత్రం ఎందుకు మారిపోయింది అంటూ రాసిన లైన్స్ వినగానే అందరికీ ఎక్కేసేలా ఉంటాయి. సాగర్ వాయిస్ కూడా ఆపాట మూడ్ కి బాగా సెట్ అయ్యింది. దేవీశ్రీ ప్రసాద్ ఈ పాట ట్యూన్ కోసం కూడా రెగ్యులర్ డ్రమ్స్, డప్పు సౌండ్స్, మధ్య మధ్యలో గిటార్ సౌండ్స్ ని ఉపయోగించి కంపోజ్ చేసేసాడు. ట్యూన్ పరంగా యావరేజ్ అనిపించినా లిరిక్స్ వలన ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది.

055. పాట : ఏం చెప్పను
గాయకుడు : కార్తీక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

తన ప్రేమ తనకు దక్కడం లేదని తెలిసినా, తను ఏం చెయ్యలేక, అక్కడి నుంచి వెళ్ళలేక ప్రేయసి కళ్ళముందే తిరగాల్సి వస్తే హీరో పడే బాధని చూపే సందర్భంలో వచ్చే విషాద గీతికని సిరివెన్నెల సీతారామశాస్త్రి చాలా బాగా రాసారు. కార్తీక్ కూడా ఈ పాటలోని ఫీలింగ్ ని తన వాయిస్ లో చూపించాడు. కానీ పాటని పాడించిన విధానం, దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఎక్కడో విన్నాం అనే ఫీలింగ్ ని మాత్రం కలిగిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన చాలా విషాద గీతాల్లో లానే ఈ పాటలో కూడా కూడా వయొలిన్, ఫ్లూట్ ని ఉపయోగించిన విధానం బాగుంది. ఈ పాటలోని లిరిక్స్ వలన వినగా వినగా ఈ పాట బాగా నచ్చుతుంది. ఈ పాట విజువల్ గా మనసుకు హత్తుకునేలా ఉండే అవకాశం ఉంది.

6. పాట : ఈ ప్రేమకి07
గాయని : చిత్ర
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

పైన వచ్చిన విషాద గీతానికి వచ్చే ఫీమేల్ వెర్షన్ బిట్ సాంగ్ ఇది. చిత్ర ఈ బిట్ సాంగ్ కి తన గాత్రంతో జీవాన్ని ఇచ్చారు. ఈ బిట్ సాంగ్ మొదట్లో దేవీశ్రీ కీ బోర్డ్ తో చేసిన మ్యూజిక్ బిట్ బాగుంది.

తీర్పు :

రామ్ – కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను శైలజ’ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో తెరకెక్కిన చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. దేవీశ్రీ ప్రసాద్ కూడా ఆ కథకి పర్ఫెక్ట్ గా సింగ్ అయ్యే ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా సాహిత్య రచయితలు ప్రతి వారికి సింక్ అయ్యేలా రాసిన సాహిత్యం వలనే నేను శైలజ ఆల్బమ్ ఫీల్ గుడ్ ఆడియో అనిపించుకుంటుంది. మా పరంగా ఆల్బమ్ లో టాప్ 3 సాంగ్స్ చెప్పమంటే.. క్రేజీ ఫీలింగ్, శైలజ శైలజ, ఏం చెప్పను. మిగతా రెండు పాటలు ప్రతి ఆల్బంలో రెగ్యులర్ గా అనిపించే పాటలు. ఓవరాల్ గా ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అంటారు. ఆ సామెత ప్రకారం దేవీశ్రీ ప్రసాద్ ‘నేను శైలజ’కి సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు.

రాఘవ

నేను శైలజ ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు