సమీక్ష : భమ్ బోలేనాథ్ – పరవాలేదనిపించే క్రైమ్ కామెడీ

సమీక్ష : భమ్ బోలేనాథ్ – పరవాలేదనిపించే క్రైమ్ కామెడీ

Published on Feb 28, 2015 9:30 AM IST
Bham Bholenath Review

విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : కార్తీక్ వర్మ దండు

నిర్మాత : శిరువూరి రాజేష్ వర్మ

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : నవదీప్, నవీన్ చంద్ర, ప్రదీప్, పూజ, ప్రాచీ..


టాలీవుడ్ యంగ్ హీరోస్ అయిన నవదీప్, నవీన్ చంద్రలతో పాటు యాంకర్ ప్రదీప్ హీరోలుగా నటించిన స్మాల్ బడ్జెట్ మల్టీ స్టారర్ ఫిల్మ్ ‘భమ్ బోలేనాథ్’, క్రైమ్ అండ్ మనీ రాబరీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా పూజ, ప్రాచీ హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. ‘కార్తికేయ’ సినిమాతో ఓ మంచి కాన్సెప్ట్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా ద్వారా కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరి ఈ క్రైమ్ కామెడీ మల్టీ స్టారర్ ఎంత వరకూ ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘భమ్ బోలేనాథ్’ కథ ఇద్దరు యంగ్ కూర్రాల్లైన నవదీప్ – నవీన్ చంద్రల చుట్టూ తిరుగుతుంది. కానీ కథలో వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ఇద్దరికీ తమ సొంత లైఫ్ లో పలు ఇబ్బందులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరికీ మనీ అవసరం అవుతుంది. ఆ మనీ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ ప్రయోజనం లేకపోతుంది. దాంతో ఇక అన్నిటిమీద ఆశ కోల్పోయిన వీరిద్దరూ ఎవరి దారిలో వారు ఒక్కో దొంగతనం ప్లాన్ చేస్తారు. అనుకున్న దాని ప్రకారం వీరి దొంగతనాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి. అప్పుడే కథలోకి డ్రగ్ అడిక్ట్ అయిన ప్రదీప్ మాచిరాజు ఎంటర్ అవడంతో అసలైన ట్విస్ట్. దాంతో నవదీప్ – నవీన్ చంద్ర లు ఇబ్బందుల్లో పడతారు. మరి నవదీప్ – నవీన్ చంద్రలు రాబరీ తర్వాత తమకు వచ్చిన ఇబ్బందులను ఎలా ఎదుర్కున్నారు.? అసలు కథలోకి ఈ ప్రదీప్ ఎందుకు వచ్చాడు.? చివరికి నవదీప్ – నవీన్ చంద్రలు తాము దొంగిలించిన డబ్బును దక్కించుకున్నారా.? లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్న కథ చాలా బాగుంది. ఈ చిత్ర మేకర్స్ సినిమాలో అన్ని రకాల ట్విస్ట్ లని చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అవి ఆన్ స్క్రీన్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక జాబ్ లేని కుర్రాడి పాత్రలో నవదీప్ నటన చాలా బాగుంది. తనకిచ్చిన పాత్రతో ఆడియన్స్ ని బాగా కన్విన్స్ చేసి పాత్రతో ట్రావెల్ అయ్యేలా చేసాడు. ఇక నవీన్ చంద్ర మాస్ కుర్రాడి లుక్ లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ లుక్ కి తగ్గట్టుగానే సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ప్రదీప్ మాచిరాజు సినిమా మొత్తం ట్రావెల్ అవ్వడమే కాకుండా కొన్ని ఆసక్తికర సన్నివేశాల్లో మంచి నటనని కనబరిచాడు.

సినిమా మొత్తం రెగ్యులర్ పంచ్ డైలాగ్స్ కామెడీతో కాకుండా సందర్భానుసారంగా వచ్చే కామెడీతో బాగానే ఆకట్టుకున్నారు. కమెడియన్స్ ప్రవీణ్, నవీన్ కలిసి మంచి కామెడీని ఆడియన్స్ కి అందించారు. పోసాని కృష్ణ మురళి – ఫిష్ వెంకట్ కామెడీ ఎపిసోడ్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వల్ బ్లాక్ మరియు ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని కన్ఫ్యూజన్ సీన్స్ ని చాలా బాగా డీల్ చేసారు. పూజ జవేరి చూడటానికి చాలా బాగుంది. మిగతా నటీనటులు కూడా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాని మొదలు పెట్టడం చాలా స్లోగా ఉంది. మొదటి 15 నిమిషాలు స్టెప్ బై స్టెప్ కథలోకి వెళ్ళడం వలన మొదట్లో కాస్త బోర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఆసక్తికరంగా నడిపినా క్లైమాక్స్ దగ్గరికి వచ్చే సరికి సినిమాని కాస్త కిచిడీ చేసేసారు. క్లైమాక్స్ లో కూడా కొన్ని కనెక్ట్ అయ్యే మోమెంట్స్ ఉన్నాయి కానీ సాగదీసి గందరగోళం చెయ్యడం వల్ల ఆ ఫీలింగ్ పోయింది. అలాగే క్లైమాక్స్ లో లాజిక్ లేకుండా అనవసరపు కామెడీ పెట్టాలని ట్రై చేసి డైరెక్టర్ డెబ్బై పోయాడు.

సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో క్లారిటీ అస్సలు ఉండదు. డాన్ పాత్ర మరియు అతని చుట్టూ అల్లుకున్న కామెడీ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. భమ్ బోలేనాథ్ కి మంచి కథ కుదిరినా ఎగ్జిక్యూషన్ మాత్రం మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని సరిగా ఎడిట్ చేయలేదనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాయి కార్తీక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ సినిమాలో బాగుంది, అలాగే ఈ క్రైమ్ కామెడీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండడం వలనే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా దొంగతనం సీన్స్ మరియు చేజింగ్ సీక్వెన్స్ లను చాలా బాగా చూపించాడు. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనేలా ఉంది. ఎడిటర్ ముఖ్యంగా క్లైమాక్స్ ని ఇంకాస్త బెటర్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. డైరెక్టర్ కార్తీక వర్మ మొదటి సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. కథ బాగుంది, కథనం బాగుంది కానీ దర్శకుడిగా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసాడు. క్లైమాక్స్ విషయంలోనే డైరెక్టర్ మరింత జాగ్రత్త వహించాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా నిర్మించారు.

తీర్పు :

నవదీప్ – నవీన్ చంద్ర నటించిన ‘భమ్ బోలేనాథ్’ సినిమాలో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కొన్ని మోమెంట్స్ ఉన్నాయి. స్టొరీ పాయింట్, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, సందర్భానుసారంగా నవ్వించే కామెడీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. మరో వైపు కాస్త సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా అంతా బాగా నచ్చేస్తుంది. మిగతవాళ్ళు చూడాలనుకుంటే చూడచ్చు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు