సమీక్ష : చంద్రకళ – రొటీన్ థ్రిల్లర్

Chandrakala-Movie-Review విడుదల తేదీ : 19 డిసెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : సుందర్ సి
నిర్మాత : కళ్యాణ్ సి
సంగీతం : భరద్వాజ్, కార్తీక్ రాజా (రీ రికార్డింగ్)
నటీనటులు : సుందర్ సి, హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మి

మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. తమిళంలో విజయం సాదించిన పలు సినిమాలను తెలుగులో అనువదింపబడి ఇక్కడ కూడా విజయం కైవసం చేసుకున్నాయి. ఈ కోవలో నేడు విడుదలైన సినిమా ‘చంద్రకళ’. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను తెలుగు అనువదించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :

స్వగ్రామంలో తమ పూర్వీకుల ఇంటిని (ప్యాలెస్) అమ్మివేయాలని ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ ఊరు బయలుదేరతారు. వారు పూర్వీకుల ఇంటికి చేరుకోగానే.. కుటుంబంలో అమ్మాయిలు మాయ( రాయ్ లక్ష్మి) & మాధవి (ఆండ్రియా)లకు తమ చుట్టూ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్న విషయాన్ని గమనిస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. ప్యాలెస్ లో ఒక దుష్ట ఆత్మ (హన్సిక) ఆవహించినట్లు కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.

ఆ దుష్ట ఆత్మ ఎవరు..? అసలు ప్యాలెస్ లో ఒక దుష్ట ఆత్మకు పనేంటి..? కుటుంబ సభ్యులందరూ తమ సమస్యలను ఎలా పరిష్కరించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. మీరు వెండి తెరపై ‘చంద్రకళ’ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మిలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముగ్గురూ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. తన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో ఒక శక్తివంతమైన పాత్ర పోషించిన హన్సిక మిగతా ఇద్దరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేకూర్చింది.. ముఖ్యంగా హాన్సిక పాత్రను మలిచిన తీరు బాగుంది. క్లైమాక్స్ సన్నివేశాలలో ఆండ్రియా ఇంప్రెస్సివ్ నటనతో బాగా ఆకట్టుకుంటుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. సహాయక పాత్రలో సుందర్ సి డీసెంట్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. దర్శకుడిగా ప్రేక్షకులను చివరి వరకూ సస్పెన్స్ లో ఉంచడంలో సక్సెస్ అయారు.

మైనస్ పాయింట్స్ :

ఒకసారి సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమా ఆసక్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ బాగున్నా ఎక్కువసేపు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అనవసరమైన చోట క్లైమాక్స్ లో సాంగ్ రావడంతో క్లైమాక్స్ లో మరిన్ని ఎలెమెంట్స్ వచ్చి చేరతాయి. హన్సిక పాత్ర స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది. స్క్రీన్ టైం కొంచం పెంచి ఆమె పాత్రను మరింత ఎలివేట్ చేయాల్సింది.

సినిమాను మరింత గ్రిప్పింగ్ గా మలచడం కోసం పాటలను తొలగించాల్సింది. సినిమాలో మరో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే.. బాగా భయపెట్టే సన్నివేశాలు, భయానక అంశాలు లేకపోవడం. సినిమా అస్పష్టంగా ప్రారంభమవుతుంది. పదిహేను నిమిషాల తర్వాత దారిలోకి వస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయాల్సింది. ప్యాలెస్ మరియు ఆ మొత్తం సెట్ అప్ చాలా డీసెంట్ గా తీర్చిదిద్దారు. ముందుగా చెప్పినట్టు సినిమాలో పాటలను తొలగించాల్సింది. సంగీతం బాగోలేదు.

క్లైమాక్స్ వరకూ సినిమా స్క్రీన్ ప్లే డీసెంట్ గా ఉంది. ఆ తర్వాత గజిబిజిగా తయారయింది. ఎడిటింగ్, డైలాగ్స్ పర్వాలేదు. సుందర్ సి దర్శకత్వం ఓకే. సినిమా చివరి వరకూ ప్రేక్షకులను సస్పెన్స్ లో నిమగ్నం చేయడంలో సక్సెస్ అయ్యారు.

తీర్పు :

ఓవరాల్ గా, సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మిల డీసెంట్ పెర్ఫార్మన్స్.. ఆసక్తికరమైన కథ, కథనాలు సినిమాకు బేసిక్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మరోవైపు క్లైమాక్స్ ను బాగా సాగదీయడం, సినిమాలో పెద్దగా భయపెట్టే సన్నివేశాలు, భయానక అంశాలు లేకపోవడం సినిమా ఫ్లోను కాస్త చెడగోట్టాయి. ఈ వీకెండ్ లో మీకు వేరే ఏమీ ప్లాన్స్ లేకపోతే సినిమాను చూడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :