విడుదల తేదీ : మార్చ్ 11, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు: ధనుష్, మాళవిక మోహనన్, సముద్రఖని, స్మృతి వెంకట్, రాంకి
దర్శకత్వం : కార్తీక్ నరేన్
నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: వివేకానంద్ సంతోషం
ఎడిటర్ : ప్రసన్న జి.కె.
లేటెస్ట్ గా థియేటర్స్ లో కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నా మరికొన్ని సినిమాలు ఓటిటి లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అలా రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా “మారన్” హీరో ధనుష్ నటించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నటించింది. మరి ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. మారన్(ధనుష్) తండ్రి మూర్తి(రాంకీ) ఒక పొలిటీషియన్ కి సంబంధించిన ఓ దారుణమైన నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసాడని అతన్ని చంపించేస్తారు. అయితే ధనుష్ కూడా తన తండ్రి కోణం లోనే ఒక జర్నలిస్ట్ గా మారతాడు. మరి ఈ క్రమంలో ధనుష్ కూడా ఒక పెద్ద సమస్యలో పడతాడు. మరి తాను అలా పడటానికి గల కారణం ఏమిటి? అతనికి ఏ పొలిటీషియన్ నుంచి సమస్య వచ్చింది? దీనికి తన తండ్రి మరణానికి ఏమన్నా సంబంధం ఉందా అనేవి తెలియాలి అంటే మారన్ ని హాట్ స్టార్ లో చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
ఎప్పటిలానే ధనుష్ తన సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాలో కూడా కనబరిచాడు. ఒక యంగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఇంప్రెస్ చేస్తాడు. అలాగే ఈ సినిమాలో కొన్ని కీలక ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు మంచి ఆసక్తిగా ఉంటాయి. అలాగే కొన్ని అక్కడక్కడా థ్రిల్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ని మించి పెద్ద పెద్ద బ్లండర్స్ ఉన్నాయని చెప్పాలి. అసలుకే అయితే అసలు ధనుష్ ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నాడో అనేది తనకే తెలియాలి. తన స్టార్డం ని ఇలాంటి సరైన బేస్ లేని సినిమాలకి ఇవ్వడం వృథా. ఈ సినిమాలో అనేక చోట్ల సీన్స్ చాలా ఓవర్ గా కనిపిస్తాయి.
ఎలాంటి లాజిక్స్ తో సంబంధం లేకుండా అర్థరహిత స్క్రీన్ ప్లే తో విసుగు తెప్పించేలా ఉంటుంది. ఇంకా ఓ కిడ్నపర్ పోలీస్ కి ఫోన్ చేసే సీన్ ధనుష్ పై కొన్ని సెన్స్ లెస్ సీన్స్ అన్నీ చిరాకు తెప్పిస్తాయి.
ఇంకా ఈ సినిమాలో సరైన కథే లేదు, పోనీ కథనం ఏమన్నా ఆసక్తిగా ఉంటుంది అంటే అది కూడా లేదు. ఇంకా ఇదే సినిమా గాని థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఆడియెన్స్ కి డెఫినెట్ గా డబ్బులు వృథా తప్ప మరో మాట లేదని చెప్పాలి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్లేదు అని చెప్పాలి. టెక్నికల్ టీం లోకి వచ్చినట్టు అయితే అలాగే సినిమా సంగీతం మరియు సినిమాటోగ్రఫీ లు పరవాలేదు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి చెప్పాల్సిన పని లేదు.
ఇక దర్శకుడు కార్తీక్ నరేన్ విషయానికి వస్తే తాను చిన్న లైన్ పెట్టుకొని దానికి అనవసరంగా 2 గంటల సినిమాని అల్లాడు. కంప్లీట్ గా తన దర్శకత్వం ఈ సినిమాకి పెద్ద వైఫల్యం అని చెప్పాలి. గొప్పగా చెప్పుకునే అంశాలు ఏవి కూడా ఈ చిత్రంలో లేవు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మారన్” చిత్రం ధనుష్ కెరీర్ లోనే ఒక వరస్ట్ వర్క్ అని చెప్పాలి. తనవి కొన్ని అండర్ రేటెడ్ సినిమాలు, అంతగా గుర్తింపు తెచ్చుకోని సినిమాలు ఉన్నా ఇది ఏ కోవ లోకి కూడా రాదు. ఒకవేళ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ధనుష్ కెరీర్ లో ఊహించని ఫలితాన్ని ఇది దక్కించుకొని ఉండేది. అలాగని ఓటిటి లో కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా కూడా కాదు ఇది. సో ఈ సినిమాకి దూరంగా వుంటేనే బెటర్.
123telugu.com Rating: 1.5/5
Reviewed by 123telugu Team