సమీక్ష : డాలర్ కి మరోవైపు – దారితప్పి బోర్ కొట్టించే డాలర్.

సమీక్ష : డాలర్ కి మరోవైపు – దారితప్పి బోర్ కొట్టించే డాలర్.

Published on Aug 29, 2015 5:45 PM IST
Dollar Ki Maro Vaipureview

విడుదల తేదీ : 28 ఆగష్టు 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : పూసల   

నిర్మాత : సత్యం

సంగీతం : కమల్ కుమార్

నటీనటులు : యశ్వంత్, మిత్ర, నాజర్, సత్యనారాయణ…


ఎన్నో టీవీ సీరియళ్ళకి రైటర్ గా పనిచేసిన పూసల దర్శకుడుగా మారుతూ చేసిన సినిమా ‘డాలర్ కి మరోవైపు’. యువ నటీనటులైన యశ్వంత్, మిత్ర హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాజర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. సత్యం నిర్మించిన ఈ సినిమాకి ఎ. జమున కుమారి కథని అందించారు. డాలర్ కోసం ఆరాట పడుతున్న యువతరంకి ఓ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

పల్లెటూరిలో పుట్టి పెరిగిన కేశవ్(నాజర్)కి సినీ నటుడు అవ్వాలని కోరిక. అనుకున్నట్టుగానే అతనికి చెన్నై నుంచి అవకాశం వస్తుంది. కానీ చిన్న పిల్లలైన తన కొడుకుల కోసం చెన్నై వెళ్ళకుండా ఆగిపోయి, అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ పిల్లలని చదివిస్తాడు. కేశవ్ పెద్ద కొడుకైన కళ్యాణ్(యశ్వంత్) బాగా చదివి ఫై చదువుల కోసం అమెరికా వెళ్తాడు. అంతే కాకుండా అక్కడే చదువులు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుంటాడు. అలా అక్కడి నుంచి డాలర్స్ పంపించి తన ఫ్యామిలీకి అన్ని వసతులను కల్పిస్తాడు. అలా హ్యాపీగా సాగిపోతున్న టైంలో కళ్యాణ్ కి సత్యభామ(మిత్ర)ని ఇచ్చి పెళ్లి చేస్తారు.

చిన్నప్పటి నుంచి స్వార్ధ పూర్తితమైన తల్లి తండ్రుల నడుమ పెరిగిన సత్యభామ కి అవే బుద్దులు వస్తాయి. పెళ్ళైన నాటి నుంచి మొగుడు డబ్బు అంతా తనకేదక్కాలని, తనకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తుంది. దాంతో కళ్యాణ్ మరియు తన తండ్రి అయిన కేశవ్ మధ్య గొడవలు పెట్టడం మొదలు పెడుతుంది. దాంతో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సమస్యలు మొదలవుతాయి. అటు భార్య – ఇటు కుటుంబం, ఏం చెయ్యాలో అర్థంకాని సమస్యల్లో చిక్కుకున్న కళ్యాణ్ ఈ సమస్యల సుడిగుండంలో నుండి బయట పడటానికి ఏంచేసాడు .? చివరికి కుటుంబం కోసం భార్యను వదులుకున్నాడా లేక భార్య కోసం కుటుంబాన్ని వదులుకున్నాడా.? లేక చివరికి సత్యభామ తను చేసిన తప్పు తెలుసుకుందా.? అనే విషయాలను మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

‘డాలర్ కి మరోవైపు’ సినిమాలో చెప్పికోదగిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఈ సినిమా కోసం అనుకున్న స్టొరీ లైన్. ‘పై చదువుల కోసం, ఉన్నత స్థానం కోసం యువతరం అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళాలి కానీ ఎంత బిజీగా ఉన్నా కన్న తల్లి తండ్రులను కూడా గుర్తు పెట్టుకోండి, వారి కోసం కూడా కాస్త సమయం కేటాయించండి’ అని చెప్పే స్టొరీ లైన్ బాగుంది. అలాగే సినిమా మొదట్లి అతిధి పాత్రలో కనిపించిన కైకాల సత్యనారాయణ చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి.

ఇక సీనియర్ నటుడు నాజర్ చాలా మంచి నటనని కనబరిచాడు. అలాగే తనకి బెస్ట్ ఫ్రెండ్ గా చేసిన శివాజీ రాజా పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే రెండు మూడు ఫ్రెండ్షిప్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరోగా నటించిన యశ్వంత్ పెర్ఫార్మన్స్ బాగుంది. తనకి ఇచ్చిన పాత్రలో డీసెంట్ అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ బాగా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. కథా విస్తరణ గురించి.. మంచి స్టొరీ లైన్ అనుకున్నారు బాగుంది. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకునే పూర్తి కథ కూడా అంతే బాగుండాలి కదా. ఆ విషయంలో తప్పు జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కాస్త క్లారిటీగా కనిపించినా సెకండాఫ్ మాత్రం గందరగోళం అనిపిస్తుంది. దానికి కారణం హీరోయిన్ పాత్రని, ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది, అలా బిహేవ్ చెయ్యడానికి గల కారణం ఏంటి అనే పాయింట్ ని సరిగా రాసుకోలేదు సరికదా ఆడియన్స్ కి క్లియర్ గా కూడా చెప్పలేకపోయారు. దాని వల్ల కథలో చెప్పాలనుకున్న పాయింట్ సెకండాఫ్ లో పక్కకి వెళ్ళిపోయింది.

అలాగే సినిమాలో కథని మలుపులు తిప్పే పాత్రలో కనిపించిన మిత్ర పెర్ఫార్మన్స్ కూడా ఆకట్టుకునేలా లేదు. తన ప్లేస్ లో ఇంకాస్త బెటర్ హీరోయిన్ ని తీసుకుంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేది ఏమో. కథ లానే కథనం కూడా ఈ సినిమాకి మైనస్. సెకండాఫ్ లో కథనంతో గందరగోళం క్రియేట్ చేసారు, అలాగే సినిమాని సాగ దీసేసారు. ఎంతలా అంటే సినిమా రన్ టైం 2 గంటలు, కానీ ఒక్క సెకండాఫ్ మాత్రమే మూడు గంటల రన్ టైం ఉందేమో అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కథలో అనుకున్న పాయింట్ ని సెకండాఫ్ లో బాగా సీరియస్ చేసి క్లైమాక్స్ లో కుండ బద్దలు కొట్టి నట్టు చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా సినిమాని సాగ దీసేసి, అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలో ఐటెం సాంగ్స్ పెట్టి అసలు కంటెంట్ ని వదిలేసాడు. హీరోయిన్ పాత్ర ద్వారా తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టాలనుకునే ఒక్క సీన్ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. ఆ సీన్స్ లో ఉండాల్సిన సీరియస్ నెస్ సినిమాలో కనిపించదు.

అలాగే సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఒకటి రెండు ఎమోషన్స్ ని తప్ప ఆ తర్వాత వచ్చే ఏ సీన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. సినిమానే సాగదీస్తున్నారు బాబోయ్ అనుకుంటుంటే సినిమాలో రెండు ఐటెం సాంగ్స్, మూడు తరాల మధ్య వచ్చే ఓ డ్యూయెట్ సాంగ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సినిమాలో కామెడీ అనేడి అస్సలు లేనే లేదు. సరే ఎమోషన్స్, సెంటిమెంట్ ని అన్నా పండిచారా అంటే అదీ లేదు. అలాగే సినిమాలో అమెరికా అని చూపిచ్నఃదానికి ట్రై చేసిన ప్రతి సీన్స్, బ్లూ మాట్ వెర్షన్స్ అస్సలు సెట్ అవ్వలేదు. అది మెరికా సెటప్ కాదని ఈజీగా తెలిపోతుంటుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఏమన్నా మెచ్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అంటే అది స్టొరీ లైన్ మాత్రమే. ఎ.జమున కుమారి అనుకున్న స్టొరీ లైన్ బాగున్నా కథా డెవలప్ మెంట్ మాత్రం సరిగా కుదరలేదు. వీర సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రంగా ఉంది. కమల్ కుమార్ పాటలు అస్సలు బాగా లేవు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. ఎడిటర్ గా నందమూరి హరి అయినా కేర్ తీసుకొని ఇంకాస్త రన్ టైం తగ్గించాల్సింది.

పూసల డీల్ చేసిన కథనం – మాటలు – దర్శకత్వం విభాగాల విషయానికి వస్తే.. కథనం – చాలా బోరింగ్, మాటలు – అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకా బెటర్ డైలాగ్స్ పడాల్సింది. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకోలేకపోవడమే కాకుండా ఓ మంచి కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా చెప్పలేక వృదా చేసారు. ఇక నిర్మాత సత్యం నిర్మాణ విలువలు కూడా జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

ఈ వారం విడుదలైన ‘డాలర్ కి మరోవైపు’ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచే సినిమాగా మిగిలిపోయింది. సినిమాలో కామెడీ లేకపోయినా, ఫైట్స్ లేకపోయినా అనుకున్న కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ చేయగలితే చాలు. కానీ డైరెక్టర్ పూసల అదే మిస్ అవ్వడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్, నాజర్ – శివాజీ రాజా సీన్స్ తప్ప చెప్పుకోదగిన అంశం ఒక్కటీ లేదు. కావున ఓవరాల్ గా ‘డాలర్ కి మరోవైపు’ సినిమా ప్రేక్షకులకు చెడు అనుభవాన్ని మిగిల్చే సినిమా.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు