ఓటిటి రివ్యూ : “దృశ్యం 2” – థ్రిల్ చేసే సీక్వెల్

ఓటిటి రివ్యూ : “దృశ్యం 2” – థ్రిల్ చేసే సీక్వెల్

Published on Feb 21, 2021 2:00 PM IST


123తెలుగు.కామ్ రేటింగ్ :  3.5/5

నటీనటులు: మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, మురళి గోపీ, సిద్దిక్, అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్

దర్శకుడు: జీతు జోసెఫ్

నిర్మాత: ఆంథోనీ పెరుంబవూర్

సంగీత దర్శకుడు: అనిల్ జాన్సన్

సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్

ఎడిటింగ్: వి.ఎస్. వినాయక్

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “దృశ్యం 2”.దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడ్డ ఈ మళయాళ చిత్రం సీక్వెల్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

అనేక భాషల్లో సూపర్ హిట్ కాబడిన మొదటి పార్ట్ “దృశ్యం” కథ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ ఒకటే కానీ ఒరిజినల్ వెర్షన్ మళయాలం కు వస్తే పాత్రలు మారుతాయి. మొదటి పార్ట్ లో కీలక సంఘటనల అనంతరం జార్జ్ కుట్టి(మోహన్ లాల్) అతని భార్య రాణి(మీనా) వారి పిల్లలు అంజు(అన్షిబా) అలాగే అను(ఎస్తర్) లు బయటపడి వస్తారు. మరి ఈ సీక్వెల్ కు వస్తే వారి కుటుంబ పరిస్థితులు కూడా చాలా మారుతాయి ఆరేళ్లలో జార్జ్ కుట్టి తనకున్న సినిమాలపై మక్కువతో ఆ రంగంలోనే థియేటర్ నుంచి నిర్మాత స్థాయికి ఎదుగుతాడు.

కానీ మరో పక్క మొదటి పార్ట్ లో తన బిడ్డ వరుణ్ ను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఐజీ, ఆమె భర్త సిద్ధిక్ లు యూఎస్ లో సెటిల్ అవుతారు. కానీ తమ బిడ్డ ఆచూకీ దొరుకుతుంది ఏమో అని కుట్టి ఉన్న గ్రామానికి తరచూ వస్తుంటారు. మరి ఇంకోపక్క అక్కడి సరికొత్త ఐజీ(మురళీ గోపి) ఈ భూస్థాపితం కాబడిన కేసును సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరి ఇక్కడ నుంచి ఈ కథ ఎలా మలుపు తిరిగింది? మళ్ళీ కుట్టి ఫ్యామిలీకి సవాళ్లు ఎదురయ్యాయా?మళ్ళీ వరుణ్ దేహం బయటకు వస్తుందా? ఈసారి కథ ఎలా రసవత్తరంగా మారింది అన్నది తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మిస్సవ్వకండి.

ప్లస్ పాయింట్స్ :

మొదటి పార్ట్ చూస్తే యూనానిమస్ గా మెయిన్ లీడ్ అయినటువంటి హీరో పాత్రే చివరి వరకు ఈ స్ట్రాంగ్ కంటెంట్ ను తన భుజ స్కందాలపై మోస్తుంది. అలాగే ఈసారి కూడా మోహన్ లాల్ రోలే అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తుంది. అందులో కనిపించిన మోహన్ లాల్ మరోసారి తన షో అంటే ఏంటో ఇంటెలిజెన్స్ పెర్ఫామెన్స్ తో చూపించారు.

అలాగే మీనా మరోసారి తన ఎమోషనల్ నటనతో ఇందులో ఆకట్టుకున్నారు. అలాగే వీరి కుటుంబంపై వచ్చే ఎపిసోడ్స్ ఎమోషన్స్ అన్నీ స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యాయి. ఇక మరో కీలక పాత్రలో కనిపించిన గోపి మోహన్ తన పాత్రలో కరెక్ట్ గా సెట్టయి రక్తి కట్టించడమే కాకుండా అతనిపై డిజైన్ చేసిన సీక్వెన్స్ లు కూడా ఒకింత ఆసక్తికరంగా అనిపిస్తాయి.

ఇక అలాగే ఇతర కీలక నటీనటులు కూడా మంచి నటనను కనబర్చారు. ఇంకా అలాగే మరో మెయిన్ అంశం కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అదే ఫస్ట్ పార్ట్ కన్నా ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా ఉండదా అని కానీ దాన్ని సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తారు. ఇది ఖచ్చితంగా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ కు వస్తే మెయిన్ లీడ్ మోహన్ లాల్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవి ఒకింత బోరింగ్ ఎక్కువయ్యాయి అనిపించొచ్చు. అలాగే మొదటి పార్ట్ షేడ్స్ కాస్తే రొటీన్ గా అనిపిస్తాయి అంతే.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ వారి టెక్నికల్ టీం ఎఫర్ట్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పాలి. సతీష్ కురుప్ నాచురల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మంచి ఎస్సెట్ గా నిలవగా అనిల్ జాన్సన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ సీన్ కు తగ్గట్టుగా ఎలివేట్ చేస్తూ అవుట్ స్టాండింగ్ గా వచ్చాయని చెప్పాలి. మరి అలాగే వీరిచ్చిన అవుట్ పుట్ కు స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిందే. అంతే కాకుండా టోటల్ సినిమా విలేజ్ సెటప్ ఇతర సెట్టింగ్స్ అన్ని డీసెంట్ గా అనిపిస్తాయి.

ఇక దర్శకుడు జీతూ జోసెఫ్ విషయానికి వస్తే తన బ్రిలియెంట్ టేకింగ్ అండ్ డైరెక్షన్ కోసం ఎంత చెప్పినా తక్కువే..మొదటి పార్ట్ కు సీక్వెల్ కదా ఈసారి కొత్తగా స్టోరీ ఎలా చూపిస్తారు? ఎలా ముగిస్తారు అన్నదానికి మైండ్ బ్లోయింగ్ నరేషన్ తో సమాధానం చెప్పారు. అక్కడక్కడా కాస్త స్లో నరేషన్ తప్పిస్తే చివరి వరకు ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించిన విధానం, రాసుకున్న సీక్వెన్స్ లు హైలైట్ అని చెప్పాలి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే “దృశ్యం 2” ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పాలి. చిన్న మైనర్స్ తప్పితే ప్రతీ ఒక్క అంశంలో కూడా మంచి నిర్మాణ విలువలు, కథ కథనం, మోహన్ లాల్ అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ జీతూ జోసెఫ్ బ్రిలియెంట్ డైరెక్షన్ అలాగే థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తాయి. అలాగే ఈ చిత్రం ఖచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ కు పూర్తి అర్హత కలిగి ఉన్నదే అని సినిమా చూసాక ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ పర్ఫెక్ట్ థ్రిల్లింగ్ సీక్వెల్ ను అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయినా మిస్సవ్వకుండా చూడాల్సినదే అని చెప్పాలి.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు