సమీక్ష : జై శ్రీరామ్ – ఆడియన్స్ కి ఫుల్ టార్చర్

సమీక్ష : జై శ్రీరామ్ – ఆడియన్స్ కి ఫుల్ టార్చర్

Published on Apr 11, 2013 8:30 PM IST
Jai-Sriram విడుదల తేదీ : 11 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : బాలాజీ ఎన్ సాయి
నిర్మాత : తెల్ల రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్
సంగీతం : దాకె
నటీనటులు : ఉదయ్ కిరణ, రేష్మ, చలపతి రావు, ఆదిత్య మీనన్……..

చాలా రోజుల గ్యాప్ తరువాత ఉదయ్ కిరణ్ నటించిన సినిమా ‘జై శ్రీరామ్’. బాలాజీ ఎన్ సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెల్ల రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్ లు నిర్మించారు. రేష్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దాకె సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ అంతటా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ :

శ్రీరామ్ శ్రీనివాస్ (ఉదయ్ కిరణ్) నీతి, నిజాయితీ గల ఒక పొలీస్ ఆఫీసర్. తనకి పొలీస్ జాబ్ అంటే గౌరవం, న్యాయం కోసం ఫైట్ చేస్తూ, సమాజాన్ని కాపాడుతూ వుంటాడు. ఇలా అతను నిజాయితీగా ఉండడం వల్ల చింతామణి, అతని కొడుకు (ఆదిత్య మీనన్ )తో గొడవ జరుగుతుంది. చింతామణి అవినీతి రాజకీయ నాయకుడు, అలాగే అనాధలను, సొంతంగా ఇల్లు లేని వారిని బందించి వారి అవయవాలను తీసి వ్యాపారం చేస్తువుంటాడు. మన హీరో శ్రీరామ్ శ్రీనివాస్ చింతామణి చేసే అరాచకాన్ని అంతం చేయాలనుకుంటాడు. దీనికోసం పోలీస్ కమీషనర్(చలపతి రావు )ఆర్డర్ కి కూడా వ్యతిరేకంగా నడుచుకుంటాడు. కానీ అతని టీం లోనే ఉన్న అవినీతి పరులైన సహా వుద్యోగుల నుండి అనుకోని కొన్ని అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీరామ్ జీవితం నాశనం అవుతుంది. అతని ఫ్యామిలీని చంపేస్తారు. అతనికంటూ ఏమిలేకుండా పోతుంది. అప్పుడు మన హీరో చింతామణిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పటి నుండి హీరో చింతామణిని అతని గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ వేటాడి వేటాడి చంపుతుంటాడు. అలాగే అతనికి, వృత్తికి ద్రోహం చేసిన సహా ఉద్యోగులను కూడా చంపేస్తాడు. చివరికి ఏం జరిగింది? తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న హీరో చివరికి తన లక్ష్యాన్ని చేరుకోగాలిగాడా? అనేది తెలుసుకోవాలంటే జై శ్రీరామ్’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఉదయ్ కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా చూడడానికి బాగున్నాడు. రేష్మ హీరోయిన్ గా ఓకే అనేలా ఉంది. ఆదిత్య మీనన్ కొత్తగా చేయాలనుకున్నాడు, కానీ అది ఈ సినిమాలో అంత మంచిగా రాలేదు. చలపతి రావు నటన బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా స్టోరీ, డైరెక్షన్ అస్సలు బాగోలేదు. ఈ సినిమా ప్లాట్ చాలా పాతది, అలాగే చాలా రొటీన్ గా తీసారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా చెత్తగా వుంది. ఈ సినిమాలో చాలా సన్నివేషాలకు సరైన ముగింపు లేదు, సినిమాలో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ముగించేసాడు. క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా పూర్ గా ఉంది. మన హీరో రౌడీలతో గాల్లోనే తిప్పి తిప్పి కొడతానని చెప్పి చాలెంజ్ చేసి అలా వాళ్ళందరినీ కొట్టడం, అసలు ఎం చేస్తున్నావ్? ఇలాంటివన్నీ రజినీ కాంత్ సినిమాల్లోనే జరుగుతాయి.. అసలు నువ్వేం ఆలోచించావ్?. రేష్మ – సిద్దు అనే అతని మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఇంకాస్త బాగుండాల్సింది. ఈ సినిమాలో నటించిన తాగుబోతు రమేష్, సన, గిరి లాంటి టాలెంటెడ్ నటులను సరిగా ఉపయోగించుకోలేదు. ఈ సినిమా అంతా ఉదయ్ కిరణ్ ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ ని పలికించాడు అదే కోపంగా ఉండటం. కొన్ని సీన్స్ లో చూడానికి అస్సలు బాగోలేడు. ఈ సినిమాలోని పాటలు సందర్భానుసారంగా రాకుండా చిరాకు తెప్పిస్తాయి. సినిమా నెమ్మదిగా సాగడం, పాటలు ఎలా పడితే అలా రావడం ఈ సినిమాకి మరో మైనస్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ శాతం జీరో గా చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ దారుణంగా వుంది. ఈ సినిమా విజువల్స్ కంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ విజువల్స్ చాలా బాగుంటాయి. ఎడిటింగ్ బాగోలేదు. దాకే సంగీతం మాములుగా వుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సన్నివేశానికి పెద్దగా సింక్ అవ్వలేదు. ప్రొడక్షన్ విలువలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. బాలాజీ ఎన్ సాయి డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యారు. ఈ సినిమా అవినీతి, యాక్షన్ సన్నివేశాలను కరెక్ట్ గా తీయకపోతే బాక్స్ ఆఫీసు వద్ద కాసులను కురిపించదు.

తీర్పు :

‘జై శ్రీ రామ్’ సినిమా కథ, డైరెక్షన్ బాగోలేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ శాతం జీరో. మీరు ఓ టార్చర్ సినిమా చూసే దాని కంటే ఈ సినిమాకి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. సీరియస్ గా ఉదయ్ కిరణ్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటే మంచి స్క్రిప్ట్ ని, టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటే మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ -1.5/ 5

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు