లాక్ డౌన్ రివ్యూ : లాక్ అప్ – తమిళ చిత్రం (జీ5)

లాక్ డౌన్ రివ్యూ : లాక్ అప్ – తమిళ చిత్రం (జీ5)

Published on Aug 20, 2020 8:48 PM IST

 

ప్రధాన తారాగణం: వైభవ్ రెడ్డి, వెంకట్ ప్రభు, వాణి భోజన్

దర్శకుడు : ఎస్. జి. చార్లెస్

నిర్మాత : నితిన్ సత్య

ఎడిటర్ : ఆనంద్ జెరాల్డిన్

 

లాక్ డౌన్ సమయం లో సినిమాలను మరియు వాటి రివ్యూస్ ను కొనసాగిస్తూ, ఈ రోజు తమిళ చిత్రం అయిన లాకప్, జీ 5 లో అందుబాటు లో ఉంది. అది ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ :

నగరం లో ఒక ప్రముఖ పోలీస్ చనిపోవడం జరుగుతుంది. అయితే ఆ స్థానం లో ఒక రోజు ఇలా వరసి (ఈశ్వరి) ను తీసుకు వస్తారు. అయితే ఈ కేసు ను దర్యాప్తు ప్రారంభిస్తుంది. మరొక వైపు వసంత్ (వైభవ్) ఒక యువ పోలీస్ కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో మూర్తి (వెంకట్ ప్రభు) కూడా ఉన్నారు. అతను ప్రమోషన్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే సీనియర్ పోలీస్ ను ఎవరూ చంపారు, ఇలా వరసి కేసును ఎలా పరిష్కరించారు నిందితులను పట్టుకున్నారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్

ఈ చిత్రం లో సన్నివేశాల్ని సమయానికి అనుగుణంగా వెనుకకు ముందుకు వివరించే విధానం చాలా బాగా కనిపిస్తుంది. ఈశ్వరి తమిళ చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించారు.వైభవ్ కూడా పోలీస్ పాత్ర లో చక్కగా నటించారు.

వెంకట్ ప్రభు పాత్ర ఈ చిత్రం లో హైలెట్ అని చెప్పాలి.దర్శకుడు ఈ చిత్రం లో మోసపూరిత విధానాన్ని చాలా చక్కగా చూపించడం జరిగింది. ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు విజువల్స్ చాలా చక్కగా చూపించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా ఆకట్టుకుంటుంది. మొదటి అరగంట సినిమా చాలా ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్ర కథను మరియు పత్రాలను అందంగా తీర్చి దిద్దిన తరువాత దర్శకుడు చ స్మార్ట్ గా ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే ప్రేక్షకులను గందరగోళానికి గురి చేయడానికి అనవసరమైన లాయర్ లను, మరియు సబ్ ప్లాట్ లను జోడిస్తారు. అపుడు చాలా డౌన్ కి పడిపోతుంది. అప్పటివరకు అద్భుతంగా సాగిన కథనం ఒక్క సారిగా ప్రేక్షకులను కాస్త గందర గోళం కి, విసుగు తెప్పించే విధంగా ఉంటుంది.

అయితే రెండవ భాగం ఎలా ఉంది అంటే, కథనం సరిగ్గా లేకపోవడం తో కొన్ని సన్నివేశాలు బలవంతం గా చేసినట్లు, కొంచెం సాగతీత లాగా అనిపిస్తుంది. ప్రేక్షకుల కి ముందుగానే ట్విస్ట్ తెలియడం తో అదే రీతిలో చిత్రం కొనసాగుతుంది.

 

తుది తీర్పు:

మొత్తం మీద ఈ లాక్ అప్ చిత్రం ఒక పోలీస్ థ్రిల్లర్ చిత్రం. కథకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా నటించారు అని చెప్పాలి. మొదటి భాగం చాలా ఆసక్తి కరంగా మరియు చూడాలి అనిపించేలా ఉంటుంది. కానీ తర్వాతి రెండో భాగం లో చాలా సబ్ ప్లాట్లు మరియు కొన్ని లాగతీత సన్నివేశాల్లో బోరింగ్ అనిపిస్తుంది. అయితే పోలీస్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు అందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. కానీ స్లో మరియు ల్యాగ్ సన్నివేశాలతో సినిమాను చూసేందుకు సిద్దంగా ఉండండి.
 

రేటింగ్: 2.75/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు