
విడుదల తేదీ : ఆగస్టు 4, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు
దర్శకుడు : భరత్ కొమ్మాలపాటి
నిర్మాత: అభినవ్ సర్దార్
సంగీతం: మణి జెన్నా
సినిమాటోగ్రఫీ: హరి జాస్తి
ఎడిటర్: విజయ్ ముక్తావరపు
సంబంధిత లింక్స్: ట్రైలర్
అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్‌వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. ఆగస్త్య.. మిత్ర(ప్రియా)ను, పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా)ను, కార్తీక్ స్వీటీ(తనియా కార్లా)ని లవ్ చేస్తారు. అయితే, ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉంటుంది. దాంతో తమ లవర్స్ తో ఈ ముగ్గురు ట్రిప్ కి వెళ్తారు. ఈ క్రమంలో జరిగే నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు ?, అతని నుంచి తప్పించుకోవడానికి ఈ మూడు జంటలు ఏం చేశారు ?, ఇంతకీ.. ఆ రౌడీ వీరి పై ఎందుకు ఎటాక్ చేశాడు? చివరకు ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్ తమ నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్ చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. ఇక సినిమాలో అడవి ట్రిప్ సన్నివేశాలు.. అదేవిధంగా ఆ జర్నీలో అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు, ఈ క్రమంలో ఎదురయ్యే ఫన్ బాగుంది.
తానియా కల్రా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. కరిష్మా కుమార్ కూడా మెప్పించింది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే బోల్డ్ సన్నివేశాలు బాగున్నాయి. సమీర్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి యాక్షన్ సీన్స్ ను బాగానే హ్యాండిల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఈ సినిమాలో ఏడు క్యారెక్టర్స్ జర్నీలో కొన్ని బలమైన బోల్డ్ మూమెంట్స్ పెట్టి మంచి ఫీల్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగే విలన్ క్యారెక్టర్ చాలా పాసివ్ గా ఉంది.
అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా.. చాలా సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇక ప్రధాన పాత్రల మధ్య ఉన్న కామెడీ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. కథ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇక ప్లే కూడా వెరీ రెగ్యులర్ గా సాగింది.
అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని యాక్షన్ కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించినా.. టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను హరి జాస్తి చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. విజయ్ ముక్తావరపు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత అభినవ్ సర్దార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అతని నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు :
మిస్టేక్ అంటూ వచ్చిన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే ఈ సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని యాక్షన్ సీన్స్, నటీనటుల పనితీరు కూడా పర్వాలేదు. అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఓ వర్గం ప్రేక్షకులకు కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team