Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : విజేతగా నిలిచిన సిద్దార్థ్ ‘ ఓహ్ మై ఫ్రెండ్’

విడుదల తేదీ: 11 నవంబర్ 2011
123 తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5
దర్శకుడు: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు
సంగీత దర్శకుడు: రహుల్రాజ్
పాత్రలు: సిద్ధార్థ్, శృతి హాసన్, నవదీప్, హన్సిక .

‘బొమ్మరిల్లు’ తరహా మ్యాజిక్ ను మళ్ళీ చేసేందుకు హీరో సిద్దార్థ్ – నిర్మాత దిల్ రాజు ఐదేళ్ళ సుదీర్ఘ విరామమం తరువాత ఒక్కటయ్యారు. ఈ దఫా సిద్దార్థ్.. హన్సిక, శ్రుతి హసన్ తో జోడీ కట్టారు. ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా రేపు విడుదల కానుంది. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ షో చూసి వచ్చాం. ఇక ఈ సినిమా ఎలా వుందో ఎప్పుడు చూద్దాం.

కథ: ఈ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితులు చందు(సిద్దార్థ్) – సిరి(శృతి హసన్) జీవితాల చుట్టూ తిరుగుతుంది. చందు మ్యుజీషియన్ కాగా, సిరి.. క్లాసికల్ డ్యాన్సర్. వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వీరి ఫ్రెండ్ షిప్ ను అంతా అపార్థం చేసుకుంటారు.

చందు- రీతు(హన్సిక) తో ప్రేమలో పడతాడు. సిరికి ఉదయ్(నవదీప్) తో నిశ్చితార్థం అవుతుంది. అంతా బావున్న సమయంలో అసూయ, అపనమ్మకాలు వీరి మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి.

ఇక మిగిలిన చిత్రమంతా చందు – సిరి ల మధ్య సంబంధం ఎలా నివృత్తి అవుతుంది..? . ఒకరి కొకరు ఎలా త్యాగం చేసుకుంటారు..? అనే కథాంశం తో సినిమా నడుస్తుంది.

ప్లస్ పాయింట్లు: కథ చెప్పిన విధానం, స్క్రీన్ ప్లే చాలా చురుగ్గా వున్నాయి. ప్రతి అంశాన్ని ఆసక్తికరంగా మలచటంలో దర్శకుని ప్రతిభ బయటపడింది.

ఈ చిత్రం తో సిద్దార్థ్ మళ్ళీ ఒక సమతుల్యమైన నటన ప్రదర్శించాడు. అతను చూడచక్కగా ఉండటమే కాదు, చందు పాత్రలో ఒదిగిపోయాడు. శ్రుతి హసన్ లోని సామర్ద్యం ఈ మూవీ తో బయటపడింది. ఈ సినిమా లో నటన ఆమె కెరీర్ లోనే ఉత్తమ మైనదిగా చెప్పవచ్చు. ఆమె తెరపై వెలిగిపోయింది. అంతేకాదు.. ఆమె హావ భావాలు ప్రదర్శించిన తీరులో చాల పరిణితి వచ్చింది. రొమాన్స్ కాకపోయినా, సిద్దార్థ్ – శృతి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇది థియేటర్ల నుంచి బయటకి వచ్చే వరకూ అలానే సాగింది. వీరి నటన సినిమా విజయానికి ఎంతో ఎంతో దోహద పడుతుంది.

సిద్దార్థ్ ను ప్రేమించే పాత్రలో హన్సిక మంచి నటనను ప్రదర్శించింది. అసంతృప్తి కలిగిన లవర్ పాత్రలో నవదీప్ కరెక్ట్ గా సరిపోయాడు. కేరళ లో అలీ కామెడి ట్రాక్ కడుపుబ్బానవ్విస్తుంది. తండ్రి-కొడుకుల సంభందాలను తనికెళ్ళ భరణి – సిద్ధార్థ్ అపురూపంగా రక్తికట్టించారు. వీరి మధ్య సాగే సెంటిమెంట్ మంచిగా వర్క్ అవుట్ అయింది.

ఈ చిత్రానికి పాటలు అదనపు బలాన్ని చేకూర్చాయి. సాంగ్స్ చిత్రీకరణ చాల బావుంది.

మైనస్ పాయింట్లు: హన్సిక ను చూపించన తీరు లో మరింత శ్రద్ధ పెడితే బావుండేది. మూవీ కాన్సెప్ట్, స్టొరీ కాస్త చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాకు దగ్గరగా ఉందనిపిస్తుంది. ఇంకా, శృతి హసన్ తరచూ తెలంగాణా యాసలో ‘సంపుతా బిడ్డా’ అన్న డైలాగ్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఆడ-మగ మధ్య స్నేహాన్ని అప్పర్థం చేసుకునే తరహా కథలు చాలా కాలంగా వాడుకలో ఉన్నవే. క్లైమాక్స్ ఊహాజనితంగా ఉంది.

సాంకేతిక విభాగాలు: ఇక్కడ మణిశర్మ యొక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ-రికార్డింగ్ గొప్పతనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇక రాహుల్ రాజ్ ట్యూన్స్ చాలా శ్రావ్యంగా సాగాయి. చిత్ర ఆద్యంతం సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. ఇక సినిమా ప్రొడక్షన్ విలువలు చాల ఉన్నతంగా ఉన్నాయనే చెప్పాలి.

డైలాగ్స్ వ్రాసిన తీరు బావుంది. కీలక సన్నివేశాలకు అవసరమైన డెప్త్ అందించేందుకు ఇవి ఎంతగానో సాయపడ్డాయి. ఎడిటింగ్ ఓకే.

తీర్పు: సిద్ధార్థ్ – దిల్ రాజు చేతుల మీదుగా మరో విజయవంతమైన చిత్రం తెరకెక్కింది. ‘ఓహ్ మై ఫ్రెండ్’ కథ చెప్పిన విధానం, తొలి నుంచి తుది వరకూ వినోదభరితంగా సాగింది. సినిమా ఒక్క క్షణం కూడా బోర్ అనిపించకుండా తీయగలిగారు. మంచి మ్యూజిక్, మరియు అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మెయిన్ అసెట్స్ అని చెప్పవచ్చు. ఆడియన్స్ కు క్లైమాక్స్ పై ముందుగానే అవగాహన ఏర్పడటం, తెలిసిన కథాంశం మాత్రమే ఈ సినిమాకున్న లోపాలు. ‘ఓహ్ మై ఫ్రెండ్’ చూసి బావుందంటూ బయటకు వచ్చే సినిమా ఇది. .

నారాయణ – ఎవి

123Telugu.com రేటింగ్: 3.25 / 5


సంబంధిత సమాచారం :