సమీక్ష 1: పంజా – ఒక యోధుడి అంతర్గత సంఘర్షణ

సమీక్ష 1: పంజా – ఒక యోధుడి అంతర్గత సంఘర్షణ

Published on Dec 10, 2011 10:39 AM IST
విడుదల తేది : 09 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : విష్ణు వర్ధన్
నిర్మాత : శోభు యార్లగడ్డ , నీలిమ తిరుమలశెట్టి, నగేష్
సంగిత డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
తారాగణం : పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవనియా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ అనే ఒక నూతన చిత్రం తో మన ముందుకు వచ్చారు. విష్ణువర్ధన్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి నిర్మాతలు గా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తం గా భారీ విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

జైదేవ్ (పవన్ కళ్యాణ్) ఒక సకల సాయుధ విద్యలలో ఆరితేరిన వ్యక్తి. భగవాన్ (జాకీ ష్రాఫ్) అనే ఒక మాఫియా డాన్ కి అత్యంత సన్నిహితుడు మరియు నమ్మకస్తుడు. వీరికి కులకర్ణి (అతుల్ కులకర్ణి ) తో విభేదాలు ఉంటాయి. అన్నీ సాఫీ గా సాగుతున్న సమయం లో భగవాన్ కొడుకు మున్నా (అడివి శేష్) తిరిగి కోల్కతా లో అడుగు పెడతాడు. అతడి రాకతో అందరికీ ఇబ్బందులు మొదలవుతాయి. అతడికి జాహ్నవి (అంజలి లవనియా ) అనే ఒక క్లబ్ డాన్సర్ మీద మోజు పుడుతుంది. జైదేవ్ మాత్రం సంధ్య (సరః జేన్ డయాస్) అనే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు.

అయితే జాహ్నవి జైదేవ్ ని ఇషాతపడటం తో మున్నా కి పిచ్చి ఎక్కినంత పని అవుతుంది. ఆ కోపం లో జరగా కూడని కొన్ని సంఘటనలు జరగటం తో , జైదేవ్ కోల్కత వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. అతడు సంధ్య ఊరైన పలాస వెళతాడు. అక్కడ ఎస్.ఐ.పాపారాయుడు (బ్రహ్మానందం) ని తెలివిగా వాడుకుని ఆ ఊరి సమస్యలను పరిష్కరిస్తాడు.

ఇంతలో జైదేవ్ గతం అతడిని వెత్తుకుంటూ వస్తుంది. తర్వాత ఎం జరుగుతుంది? జైదేవ్ తన సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అనేదే కథ

ఎం బాగున్నాయి :

పవన్ కళ్యాన్ నటన చాలా బాగుంది.అతడు చాలా స్టైల్ గా మరియు అందం గా కనిపించారు. ఈ చిత్రం లో ఆయన నటన విన్నూత్నం గా ఉంది. సరః జేన్ డయాస్ చక్కగా చేసింది. ముఖ్యం గా వీరిద్దరి మధ్యా సన్నివేశాలు బాగా వచ్చాయి.

అంజలి లవనియా మంచి అందం గా, గ్లామర్ గా కనిపించింది. ముఖ్యం గా, ఆమె ఐటెం సాంగ్ లో కనువిందు చేసింది. మున్నా గా అడివి శేష్ నటన అద్భుతం గా ఉంది. బ్రహ్మానందం పాపారాయుడు గెటప్ లో బాగా నవ్వించాడు. పరుచూరి వెంకటేశ్వర రావు మరియు తనికెళ్ళ భరణి తమ పరిధి లో బాగానే నటించారు. పవన్ కళ్యాణ్ మిత్రుడి గా ఆలి బాగా చేసాడు. సంధ్యా కుటుంబ సభ్యులు గా ఝాన్సీ మరియు సుబ్బరాజు ఫర్వాలేదు అనిపించారు.

ఎం బాగాలేదు :

పవన్ కళ్యాణ్ మార్క్ సన్నివేశాలు ఈ చిత్రం లో లేవు. అతడి నుండి ఫాన్స్ ఆశించే కమర్షియల్ ఎంటర్తైన్మెంట్ అంశాలు లేవు. రెండవ భాగం లో స్క్రీన్ప్లే కాస్త స్లో గా ఉంది. బ్రహ్మానందం లేకపోతే చాలా కష్టం అయ్యేది.

కథ లో కూడా పెద్ద గా బలం లేకపోవటం తో ఆశక్తి కరమైన సన్నివేశాలు పెట్టటానికి పెద్ద గా ఆస్కారం లేదు. సినిమా ను స్టైలిష్ గా తీయటానికి పెట్టిన కష్టం లో కాస్త అయినా కథ మీద పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. చిత్రం లో డైలాగ్ లు కొన్ని ఆధ్యాత్మికం గా ఉండటం తో సగటు ప్రేక్షకుడికి అర్ధం కాని విధం గా ఉంటాయి.

సాంకేతిక అంశాలు :

ఛాయాగ్రహణం చాలా బాగుంది. ముఖ్యం గా పాటలు ఫైట్లు చాలా బాగా చిత్రీకరించారు.తెలుగు తేరా పై ఎన్నడూ చూడని విధం గా ఫైట్లు ఉన్నాయి. డైలాగ్ లు కమర్షియల్ గా లేకపోయినా, మంచి పరిణితి తో రాసినవి గా ఉన్నాయి.

ఎడిటింగ్ ఫర్వాలేదు.

విశ్లేషణ :

ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అంత గా నచ్చకపోవచ్చు. కానీ ఎటువంటి అంచనాలు లేని ప్రేక్షకుడికి చిత్రం లో ని స్టైల్, పవన్ అద్భుతమైన పరిణితి నటన, ఏక్షన్ సన్నివేశాలు బాగా నచ్చుతాయి. సినిమా రేంజ్ ఎంతో తెలియాలి అంటే సాధారణ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

మహేష్ కె.ఎస్

123తెలుగు.కాం రేటింగ్: 3/5

Panjaa Review For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు