సమీక్ష : ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ – ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా

Rebels of Thupakulagudem Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ప్రవీణ్ కందెల, శివరామ్ రెడ్డి, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, వంశీ వూటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్, విజయ్ మచ్చ

దర్శకుడు : జైదీప్ విష్ణు

నిర్మాతలు: వారధి క్రియేషన్స్

సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ ఏర్పుల

ఎడిటర్: జైదీప్ విష్ణు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

ఈ వారం థియేటర్స్ లోకి కాస్త ఎక్కువ సినిమాలే విడుదలకి వచ్చాయి. మరి ఆ విధంగా రిలీజ్ అయిన సినిమాల్లో రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం అనే సినిమా కూడా ఒకటి. ఎక్కువగా కొత్త నటీనటులు, సాంకేతికనిపుణులు వర్క్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :
ఇక కథ లోకి వస్తే, దేశంలో ఉన్నటువంటి నక్సలైట్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. వారు అందరు లొంగిపోవాలని సరెండర్ పెరేడ్ పేరిట ఒక పథకం తీసుకువస్తుంది. అందులో భాగంగా వంద మంది అమాయకులని లొంగిపోవాలి అని సూచించి వారికి అందుకు బదులుగా ప్రభుత్వం నుంచి పోలీస్ ఉద్యోగం మరియు ఆర్థికంక సాయం కల్పిస్తామని కూడా హామీ ఇస్తారు. అయితే ఈ భాద్యత తుపాకులగూడెం అనే ప్రాంతానికి చెందిన పేరు మోసిన వ్యక్తి రాజన్న(ప్రవీణ్ కందెల) కి అప్పగిస్తారు. కాగా రాజన్న, కుమార్(శ్రీకాంత్ రాథోడ్) అనే వ్యక్తికి దీనికి సంబంధించి సూచనలు చేస్తాడు. మరి ఇంతకీ రాజన్న సూచనల మేరకు కుమార్ ఆ పనిని నెరవేర్చాడా, అప్పటి నుండి తుపాకుల గూడెంలో ఉండేవారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో నటించిన ముఖ్య పాత్రధారులు అందరూ మంచి నటన కనబరిచారు అని చెప్పాలి. ముఖ్యంగా రాజన్న పాత్రలో నటుడు ప్రవీణ్ కందుల తన పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఎంతో బాగున్నాయి.

అలానే నక్సలైట్ గా శివన్న పాత్రలో కనిపించిన శివరాం కూడా ఆకట్టుకున్నారు. ఇక జైయెత్రి మకన, శ్రీకాంత్ రాథోడ్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు అనే చెప్పాలి. జైయెత్రి తెలంగాణ యాసలో పలికిన సీన్స్ డైలాగ్స్ అలరిస్తాయి. అలానే పల్లెటూరి యువకుడిగా శ్రీకాంత్ రాథోడ్ కూడా ఆకట్టుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ చాలా వరకు మంచి ఫన్నీ సన్నివేశాలతో ఆకట్టుకుంటూ సాగుతుంది. సినిమాలో రెండు సాంగ్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో బాగా డిజప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమాలో సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం అనే చెప్పాలి. కథనంలో ఎక్కడా సరైన ఫ్లో కనిపించకపోవడంతో సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ఇది బాగా కనిపిస్తుంది. అయితే కథనంలో ఇబ్బంది లేకుండా మధ్యలో ఇరికించిన పలు కామెడీ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు సరికదా అవి కథకి ఏమాత్రం సంబంధం లేకపోవడం మరింతగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటువంటి కథా బలం ఉన్న సినిమాల్లో ముఖ్యమైన ఎమోషన్స్ ని సినిమాలో మిస్ చేసారు. సినిమా ఫ్లో లో ఎక్కడా కూడా హృద్యమైన ఎమోషన్స్ ఉండనే ఉండవు. కథ ప్రకారం మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు దానిని ఆడియన్స్ నాడిని పెట్టుకునేలా తెరకెక్కించలేదు, అయితే క్లైమాక్స్ మాత్రమే పర్వాలేదనిపిస్తుంది. నక్సల్స్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో పాటు భారీ రన్ టైం ఆడియన్స్ యొక్క సహనానికి పరీక్ష పెడుతుంది.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పొచ్చు. అలాగే టెక్నికల్ టీం లో అయితే మణిశర్మ సంగీతం ప్లస్ అయ్యింది. అలాగే శ్రీకాంత్ ఏర్పుల సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. జై దీప్ ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. ముఖ్యంగా సినిమాలో ఒక 15 నుండి 20 నిమిషాల పార్ట్ ట్రిమ్ చేయవచ్చు. దర్శకుడు జైదీప్ ఎంచుకున్న కథ బాగున్నా కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకా దృష్టి పెట్టాల్సింది. చాలా అనవసర సన్నివేశాలు ఇరికించడం. సాగదీత నేరేషన్ వంటివి ఆడియన్స్ కి బాగా చికాకు తెప్పిస్తాయి. అలానే చాలా సీన్స్ ల్యాగ్ అనిపించడం తో పాటు రియాలిటీకి దగ్గరగా ఉండే సన్నివేశాలని మరింత ఆకట్టుకునేలా తెరకెక్కించి ఉంటె బాగుండేది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాలో మెయిన్ నటులు పెర్ఫామెన్స్ లు సంగీతం తప్ప సినిమా కథ, కథనాలు ఆకట్టుకోవు. ముఖ్యంగా భారీ రన్ టైం తో పాటు బోర్ గా సాగే కొన్ని సన్నివేశాలు చూసే ఆడియన్స్ ఏమాత్రం ఆకట్టుకోవు. ఆ విధంగా ఆడియన్స్ ని ఈ మూవీ చాలావరకు డిజప్పాయింట్ చేస్తుందని చెప్పాలి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version